Balakrishna Srikanth
Balakrishna Srikanth : ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు, చిన్న సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయి. స్టార్ హీరోల సినిమాలో ఫ్లాప్, యావరేజ్ గా నిలిచి చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో బాలయ్య – శ్రీకాంత్ సినిమా పోటీ కూడా ఒకటి.
1994 డిసెంబర్ 9న బాలకృష్ణ, శ్రీకాంత్ ఇద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. స్టార్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలయ్య పక్కన మొదటిసారి సౌందర్య నటించిన సినిమా టాప్ హీరో. ఈ సినిమా సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. సినిమాకు భారీ హైప్ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత యావరేజ్ గా నిలిచింది. బాలయ్య – సౌందర్య మొదటిసారి కాంబినేషన్, కమర్షియల్ సినిమా అనుకోని వెళ్తే అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవ్వలేదు. దీంతో యావరేజ్ గా నిలిచింది.
Also Read : Allu Arjun : మలయాళం దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. అయితే ఆ వార్తలు నిజమేనా?
అదే రోజు మరో స్టార్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ – ఊహ జంటగా నటించిన ఆమె సినిమా రిలీజయింది. లేడీస్ సెంటిమెంట్ ఉండటంతో లేడీస్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఫ్యామిలీలు ఆమె సినిమాకు క్యూ కట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకు వెళ్లారు. దీంతో ఆమె సినిమా పెద్ద హిట్ అయింది. ఆమె సినిమాకు ఊహ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఇది ఊహకు తెలుగులో మొదటి సినిమా.
అలా భారీ అంచనాలతో వచ్చిన బాలయ్య సినిమా – అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శ్రీకాంత్ సినిమా ఒకే రోజు రిలీజయ్యాయి. ఈ పోటీలో శ్రీకాంత్ భారీ హిట్ కొట్టాడు. బాలయ్య టాప్ హీరో యావరేజ్ గా నిలిచింది.
ఇక బాలయ్య – సౌందర్య కాంబోలో వచ్చిన ఒకేఒక సినిమాగా టాప్ హీరో నిలిచింది. ఆ తర్వాత చాన్నాళ్లకు వీరిద్దరి కాంబోలో నర్తనశాల సినిమా మొదలుపెట్టినా సౌందర్య చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆమె సినిమా తర్వాత శ్రీకాంత్ – ఊహ దగ్గరయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.