Narasimha Naidu : ‘నరసింహ నాయుడు’ ఏకంగా 1000 థియేటర్స్ లో రీరిలీజ్.. బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్ ట్రీట్

ఇటీవల వరుస రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడు కూడా అయన పుట్టిన రోజు జూన్ 10న రిలీజ్ కానుంది.

Narasimha Naidu Re Release :  నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా బి.గోపాల్‌(B Gopal) దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్‌ చిత్రం ‘నరసింహ నాయుడు’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 10న 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విడుదల చేయనున్నారు. బాలయ్య అభిమానులు అయన పుట్టిన రోజు జూన్ 10 అయినా ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. NBK108 సినిమా టైటిల్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari)గా అనౌన్స్ చేసి బర్త్‌డేకి ముందే ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు.

ఇటీవల వరుస రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడు కూడా అయన పుట్టిన రోజు జూన్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా నిర్మాత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. నరసింహనాయుడు చరిత్ర సృషించిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం అని తెలిపారు.

ఇక చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ మాట్లాడుతూ.. నరసింహనాయుడు నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. ఎమోషన్స్‌, యాక్షన్‌ పరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తీరు మరచిపోలేను. కత్తులతో కాదురా… కంటి చూపులతో చంపేస్తా అన్న డైలాగ్‌ బాలయ్య చెబితేనే బావుంటుంది. ఆ డైలాగ్‌ను ఇప్పటికీ జనాలు మరచిపోలేదు. కథ, పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చిన డైలాగ్స్, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. విజయవాడలో చేసిన వంద రోజుల ఫంక్షన్‌ని ఎప్పటికీ మరచిపోలేను. బాలయ్య ప్రజెంట్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తున్నారు. అన్‌స్టాపబుల్‌ అంటూ దూసుకెళ్తున్నారు అని అన్నారు.

Anasuya : విజయ్ దేవరకొండకు తెలీకుండానే జరుగుతుందా? డబ్బులిచ్చి మరీ నాపై నెగిటివ్ ట్రోల్స్ చేయిస్తున్నారు.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..

బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కించిన నరసింహ నాయుడు సినిమా 2001 లో రిలీజయి భారీ విజయం సాధించింది. సిమ్రాన్, పుర్రెతి జింగ్యానీ హీరోయిన్స్ గా నటించగా కె. విశ్వనాథ్, ముకేశ్ రిషి, జయప్రకాశ్ రెడ్డి. ఆశా షైనీ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అచ్యుత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన నరసింహనాయుడు సినిమా ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. లక్స్ పాప, చిలకపచ్చ కోక, నిన్నా కుట్టేసినాది, అబ్బా అబ్బా అందం.. సాంగ్స్ ఇప్పటికి మంచి మాస్ సాంగ్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో బాలయ్య నటనకు నంది అవార్డు కూడా వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు