MAA Elections 2021 : ‘మీ ఇష్టం’.. బండ్ల వెరైటీ ప్రచారం..

జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ దిగుతున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేశారు..

Bandla Ganesh

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా మారాయి. శుక్రవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేశాడు. ‘మా’ అధ్యక్ష పదవికి వీరిద్దరూ పోటీ పడుతున్నారు.

Manchu Vishnu : ఇండస్ట్రీలో అందరికీ తిండి పెడతాం.. ఆరోగ్యం కాపాడతాం- మంచు విష్ణు

ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ఎవరికి తోచినట్లు వారు ప్రచారం షురూ చేశారు. ఇక జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ దిగుతున్నాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ నేపథ్యంలో ఆయన కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశాడు.

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

‘ఒకే ఒక్క ఓటు.. మా కోసం.. మన కోసం.. మనందరి కోసం.. మా తరపున ప్రశ్నించడం కోసం’ అంటూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్టుకు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీలతో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లను ట్యాగ్ చెయ్యడం విశేషం. సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి.