Manchu Vishnu : ఇండస్ట్రీలో అందరికీ తిండి పెడతాం.. ఆరోగ్యం కాపాడతాం- మంచు విష్ణు

ఇండస్ట్రీలో కొందరు అడిగితేనే తాను సేవకు వస్తున్నానన్నారు మంచు విష్ణు. నాన్నకు చెప్పి ఒప్పించానని చెప్పారు.

10TV Telugu News

ఇండస్ట్రీలో సగం మందికి తిండే లేదు

అందరికీ చదువు, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ 

చంద్రబాబు బంధువు.. జగన్ బావ… కేటీఆర్ ఫ్రెండ్ 

నాన్న రమ్మనలేదు.. నేనే వచ్చా..

మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా విష్ణు క్లారిటీ 

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు అధ్యక్షుడిగా బరిలోకి దిగుతున్న మంచు విష్ణు. మా అసోసియేషన్ లో ఇప్పటివరకు ఎటువంటి డెవలప్ మెంట్ జరగలేదన్నారు. తమ ప్రత్యర్థి వర్గం వాళ్లు ఇస్తున్న హామీల్లో 99శాతం పనులు ఒప్పుకునేలా లేవన్నారు. తినడానికి సగం మందికి తిండి లేని టైంలో… రెస్టారెంట్ కు వెళ్లి డిస్కౌంట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు.
మా అసోసియేషన్ లో ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వడం తమ రెస్పాన్సిబులిటీ అన్నారు మంచు విష్ణు. కరోనా ఇండస్ట్రీలో ఉన్న పేదలు, ధనికులు అందరికీ క్లారిటీ ఇచ్చేసిందన్నారు. డబ్బున్నా.. లేకున్నా అందరూ సమానమేనన్నారు. అందరం దెబ్బతిన్నామని చెప్పారు. మాలో ఉన్న 9వందల మందిలో ప్రతి ఒక్కరికీ పెన్షన్, హెల్త్, మెడికల్ ఇన్సూరెన్స్ పరంగా సెక్యూరిటీ అందిస్తామన్నారు. వారి పిల్లల ఎడ్యుకేషన్ లోనూ ‘మా’ సహాయ పడుతుందన్నారు. రాబోయే తరాన్ని బాగుచేస్తామన్నారు.

Prakash Raj-MAA : ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. తప్పుకున్న సీనియర్లు

ఎడ్యుకేషన్ పాలసీపై అందరితో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు మంచు విష్ణు. తాను నటుడు నిర్మాతే కాదు.. ఎడ్యుకేషనిస్ట్ ను కూడా అని చెప్పారు.

మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలగజేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు మంచు విష్ణు. “చంద్రబాబు నాకు బంధువు. జగన్ నాకు బావ. కేటీఆర్ నాకు మంచి ఫ్రెండ్. బాబూమోహన్ బీజేపీ నేత. మాదాల రవి లెఫ్ట్ పార్టీ నాయకుడు. కాబట్టి.. ఇక్కడ పార్టీలకు చోటు లేదు. పొలిటికల్ పార్టీలు ఇంటర్ ఫియర్ కావొద్దని కోరుతున్నా. మాకు ఆ లిబర్టీ ఉంది.. మేం అంతా ఒక్కటి” అన్నారు మంచు విష్ణు.

ఇండస్ట్రీలో కొందరు అడిగితేనే తాను సేవకు వస్తున్నానన్నారు మంచు విష్ణు. నాన్నకు చెప్పి ఒప్పించానని చెప్పారు. మోహన్ బాబు తనను అడగలేదన్నారు. విష్ణును తప్పుకోమని నాన్నకు ఎవరో ఫోన్ చేసినప్పుడు.. నన్ను బరిలోకి దిగమని నాన్న చెప్పారన్నారు. దాదాపు 7వందల మందికి ఫోన్ చేసి మోహన్ బాబు మాట్లాడి విష్ణుకు వోట్ చేయాలని కోరారన్నారు.