Prakash Raj-MAA : ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. తప్పుకున్న సీనియర్లు

డ్రగ్స్ అనేది చాలా తప్పని చెప్పిన ప్రకాశ్ రాజ్... ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ప్రూవ్ అయితే చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు ప్రకాశ్ రాజ్.

Prakash Raj-MAA : ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. తప్పుకున్న సీనియర్లు

Prakash Raj

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే తన ప్యానెళ్లను ప్రకటించారు ప్రముఖ నటుడు, కంటెస్టెంట్ ప్రకాశ్ రాజ్. MAAలో రాజకీయాలతో… ఇప్పటికే హీట్ పెరిగిపోయిన ఈ ఎన్నికల్లో… మరిన్ని ట్విస్టులు ఇచ్చారాయన. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. మెయిన్ ప్యానెల్, ఎగ్జిక్యూటివ్ ప్యానెళ్లను ప్రకటించారు.

సీనియర్ నటి జయసుధ, నటి జీవిత, నటి హేమ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ధ్రువీకరించారు. జయసుధను మెయిన్ ప్యానెల్ లోకి తీసుకోవాలనుకున్నప్పటికీ.. తాను స్పోక్స్ పర్సన్ గా ఉంటానని చెప్పినట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు. జయసుధ, జీవిత, సాయి కుమార్, బండ్ల గణేశ్, బెనర్జీ, ప్రకాశ్ రాజ్ స్పోక్స్ పర్సన్స్ గా ఉంటారని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

సెప్టెంబర్ 19 నాడు మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని చెప్పారు ప్రకాశ్ రాజ్. ఆ తర్వాత.. మరో ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. ఈ మీటింగ్ లో తన ప్యానెల్లోని అందరూ పాల్గొంటారని చెప్పారు. అప్పటివరకు.. స్పోక్స్ పర్సన్స్ మాత్రమే మీడియాతో మాట్లాడతారని అన్నారు.

డ్రగ్స్ వాడకం తప్పు- ప్రకాశ్ రాజ్

విష్ణు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు మా భవనం అంటున్నారనీ… దానికన్నా చాలా ఇష్యూలు వున్నాయన్నారు ప్రకాశ్ రాజ్. MAA భవనం కావాలి అని అందరూ సభ్యులు అనుకుంటే విష్ణునే ఎన్నుకుంటారని చెప్పారు. డ్రగ్స్ అనేది చాలా తప్పని చెప్పిన ప్రకాశ్ రాజ్… ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ప్రూవ్ అయితే చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు ప్రకాశ్ రాజ్.

ప్రకాశ్ రాజ్ మెయిన్ ప్యానెల్ లోని వ్యక్తులు వీరే :

అధ్యక్షుడు- ప్రకాశ్ రాజ్

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్

ట్రెజరర్ – నాగినీడు

జాయింట్ సెక్రటరీ -అనితా చౌదరి

జాయింట్ సెక్రటరీ -ఉత్తేజ్

ఉపాధ్యక్షుడు – బెనర్జీ

ఉపాధ్యక్షురాలు – హేమ

జనరల్ సెక్రటరీ – జీవిత రాజశేఖర్

ప్రకాశ్ రాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్యానెల్ లోని 18మంది వీళ్లే.

యాంకర్ అనసూయ

నటుడు అజయ్

ఆర్గనైజర్ భూపాల్

బ్రహ్మాజీ

ఈటీవీ ప్రభాకర్

గోవిందరావు

ఖయ్యూమ్

టీవీ నటుడు కౌశిక్

నటి ప్రగతి

రమణా రెడ్డి

శ్రీధర్ రావు

శివారెడ్డి

సమీర్

సుడిగాలి సుధీర్

సుబ్బరాజు

సురేష్ కొండేటి

తనీష్

టార్జాన్.