Bandla Ganesh: కొండన్నకు బండ్లన్న కౌంటర్.. ఇచ్చిపడేశాడు!

లైగర్ ట్రైలర్ లాంఛ్‌లో అభిమానులను చూసి జోష్‌లో మాట్లాడాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ చేసిన కామెంట్స్‌పై తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తనదైన స్టయిల్‌లో కామెంట్ చేశారు.

Bandla Ganesh Counter To Vijay Devarakonda

Bandla Ganesh: లైగర్.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తుండటంత ఒకెత్తైతే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ మరో ఎత్తుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో చిత్ర యూనిట్ పండగ చేసుకుంటోంది. ఇక ఈ సినిమాకున్న క్రేజ్ ఏందిరా నాయానా అంటూ విజయ్ దేవరకొండ కూడా తనదైన స్టయిల్‌లో కామెంట్స్ చేశాడు.

Vijay Devarakonda: లైగర్ హాట్ కామెంట్స్.. ఇష్టం లేకపోయినా చేశాడట!

అయితే లైగర్ ట్రైలర్ లాంఛ్‌లో అభిమానులను చూసి జోష్‌లో మాట్లాడాడు ఈ రౌడీ స్టార్. తన అభిమానులకు తన అయ్యా తెల్వదు.. తాతా తెల్వదు.. అయినా ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే విధంగా ఈ కామెంట్స్‌ను వివరిస్తున్నారు సినీ విమర్శకులు. అయితే విజయ్ చేసిన కామెంట్స్‌పై తాజాగా తనదైన స్టయిల్‌లో కామెంట్ చేశారు స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.

Bandla Ganesh: పవన్ పార్టీలో చిరు.. మరి నేను అంటోన్న బండ్ల గణేష్!

‘‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్’’ అంటూ తనదైన మార్క్ కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. దీంతో ‘‘కొండన్నకు బండ్లన్న ఇచ్చిపడేశాడని’’ బండ్ల గణేష్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బండ్ల చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.