Bandla Ganesh Interview: డబ్బు లేదని చెప్పుతో కొడతావా.. ఇండస్ట్రీ పెద్ద మనిషి గురించి బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
తనకు జరిగిన అవమానం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh).
- V Santhosh Kumar
- Updated on- May 25, 2026 / 10:45 AM IST
Bandla Ganesh shocking comments regarding humiliation he faced in the industry.
- బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ప్రముఖుడు.
- టాలీవుడ్ పెద్ద మనిషిపై తీవ్ర దుమారం.
- డబ్బుతోనే బండ్ల గణేష్ రివెంజ్ ఛాలెంజ్.
Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ (Bandla Ganesh)తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానం గురించి వివరించారు. తాజాగా ఆయన నటుడు రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆయన.. కెరీర్ ముగిసిపోతుందనుకున్న రోజుల్లో ఒక పెద్ద మనిషి తనను ఏ కారణం లేకుండానే చెప్పుతో కొట్టాడని చెప్పి ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించారు.
నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజున ఈ ఘటన జరిగిందని బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సెట్‌లో తాను ఊరికే కూర్చుని ‘సార్.. సార్..’ అని పిలిచినందుకు, సదరు పెద్ద వ్యక్తి ఏ టెన్షన్‌లో ఉన్నాడో ఏమో గానీ.. ఒక్కసారిగా చెప్పుతో కొట్టాడని ఆవేదన చెందారు. ఆ తర్వాత రోజు ఆయన వచ్చి సారీ చెప్పినప్పటికీ, ఆ సమయంలో అది తనకు పెద్ద అవమానంగా అనిపించిందని, బలహీనుడిని కాబట్టే తనపై అలా ప్రతాపం చూపించారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
ఆ అవమానం జరిగిన వెంటనే సెట్ బయటకు వచ్చి.. “నా దగ్గర డబ్బు లేదనే కదా ఆయన నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆయనకంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు” అని ఛాలెంజ్ చేశానని బండ్లన్న చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే తర్వాత కాలంలో స్టార్ ప్రొడ్యూసర్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా మారి కోట్లు సంపాదించి చూపించానని ఆయన గర్వంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. ఆ పెద్ద మనిషి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు.
