Bandla Ganesh Son : హీరోగా ఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్ కొడుకు..? డ్యాన్స్‌లతో ఒక్కసారిగా వైరల్..
బండ్ల గణేష్ కి ఇద్దరు కొడుకులు ఉండగా హితేష్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే వార్త వైరల్ గా మారింది. (Bandla Ganesh Son)
- Saketh U
- Published on- August 10, 2026 / 04:07 PM IST
Bandla Ganesh Son
Bandla Ganesh Son : సినీ పరిశ్రమలో నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం మాములే. బండ్ల గణేష్ కి ఇద్దరు కొడుకులు ఉండగా తాజాగా హితేష్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే వార్త వైరల్ గా మారింది. బండ్ల గణేష్ తన కూతురు జనని పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా సంగీత్ ఈవెంట్ జరగ్గా ఆ వేడుకలో బండ్ల గణేష్ తనయుడు హితేష్ పలు సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు వేసి అదరగొట్టాడు.
హితేష్ తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో అందర్నీ మెప్పించాడు. దీంతో బండ్ల గణేష్ కొడుకు డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బండ్ల గణేష్ సైలెంట్ గా కొడుక్కి హీరోకి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడా? త్వరలోనే హితేష్ ని హీరోగా పరిచయం చేస్తాడా అని టాలీవుడ్ లో కూడా చర్చగా మారింది. బండ్ల గణేష్ అనుకోకపోయినా ఈ డ్యాన్సులు చూసి ఎవరో ఒక ప్రొడ్యూసర్ కచ్చితంగా హితేష్ కి సినిమా ఆఫర్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read : Vishwanath And Sons : హైదరాబాద్‌లో భారీగా సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే?
బండ్లన్న ఇమేజ్ వాడుకొని ఆయన కొడుకుని గ్రాండ్ గా హీరోగా లాంచ్ చేసే ఆలోచన ఎవరైనా నిర్మాత ఆలోచిస్తే ఇండస్ట్రీకి మరో హీరో దొరికినట్టే. మరి బండ్ల గణేష్ స్వయంగా తన కొడుకుని హీరోని చేస్తాడా? లేక వేరే నిర్మాత చేతిలో పెడతాడా చూడాలి. బండ్లన్న నటుడిగా, కమెడియన్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, థియేటర్ ఓనర్ గా, వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాడు. ఆయన లెగసీని కొడుకులు ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
బండ్ల గణేష్ తనయుడు హితేష్ వేసిన డ్యాన్సులు మీరు కూడా చూసేయండి..
#BandlaGanesh's Son Dance to
– #LailaOLaila
– #YamahoYama
– #Temper Title Songat Bandla's Daughter Sangeeth!! pic.twitter.com/2rlHdpvPMm
— Movies4u Official (@Movies4u_Officl) August 10, 2026
