Youtuber Sarayu: బిగ్ బాస్ నటి సరయుకు 11గంటల పాటు విచారణ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్‌గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో.
- Subhan Ali Shaik
- Published On : February 8, 2022 / 09:47 PM IST
Sarayu
Youtuber Sarayu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్‌గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో యూట్యూబ్ నటి సరయును 11గంటల పాటు విచారించారు పోలీసులు. తన తరపు లాయర్ తో స్టేషన్ లో 41 సీఅర్పీసీ నోటీస్‌పై వివరణ ఇచ్చుకున్న సరయు వివాదం సద్దుమణగకుండానే వెనుదిరిగింది.
తన వీడియో లో ఉన్న కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించారు సరయూ. ఫిర్యాదుదారుడి డిమాండ్స్‌కి తలొగ్గి కంటెంట్‌ని తొలగించేందుకు సిద్ధమని ప్రకటించింది సరయూ టీమ్. ఇప్పటికే అభ్యంతరకర వీడియోని ఎడిటింగ్ చేసేశామని, ఇంకా అభ్యంతరం అనుకుంటే వీడియోని డిలీట్ చేసేందుకు కూడా ఒప్పుకున్నారు.
Read Also: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరయుపై ఐపీసీ 153a, 295a సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదనీ ఫిర్యాదు దారుడు సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇప్పటికే తేల్చి చెప్పారు.
