OTT Release: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

ఈ వారం ధియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ఫుల్ఎంటర్ టైనర్ మెంట్ ఫిక్స్ చేశాయి. గురువారం నుంచే ఓటీటీలు రిలీజ్ లతో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్..

OTT Release: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!

Ott Release

OTT Release: ఈ వారం ధియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా ఫుల్ఎంటర్ టైనర్ మెంట్ ఫిక్స్ చేశాయి. గురువారం నుంచే ఓటీటీలు రిలీజ్ లతో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ మహాన్ మూవీ రిలీజ్ అవుతోంది. ఫస్ట్ టైమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి చేసిన విక్రమ్.. ఈ క్రేజీ మూవీని ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

ఫిబ్రవరి 11న ఓటీటీలో మరో క్రేజీ మూవీ రిలీజ్ అవుతోంది. స్లోగా సినిమాలు చేస్తున్నా.. కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న సుమంత్.. డివోర్స్ తీసుకున్న తర్వత లైఫ్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఫన్నీగా హిలేరియస్ గా చూపిస్తున్న సినిమా మళ్లీ మొదలైంది. సుమంత్, నైనా గంగూలీ జంటగా చేసిన మళ్లీరావా జీ 5లో ఓటీటీ రిలీజ్ అవుతోంది.

RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

ఈ వారం తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, అనన్యపాండే, సిద్దాంత్ లీడ్ రోల్స్ లో శకున్ బాత్రా డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ లవ్ స్టోరీ గెహరాయియా. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా ఉన్న గెహరాయియా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకొస్తోంది.

Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?

దీపికా పదుకోన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ధియేటర్లో రిలీజ్ అవుతోంది. 2018లో వచ్చిన బధాయి హో అనే క్రేజీ కామెడీ ఓరియంటెడ్ మూవీకి సీక్వెల్ గా బధాయి దో ఫిబ్రవరి 11న ధియేటర్లో రిలీజ్ అవుతోంది. రాజ్ కుమార్ రావ్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన బధాయి దో సినిమా ఈసారి కాస్త సెన్సిటివ్ సబ్జెక్ట్ తో ఎమోషనల్ కామెడీ చూపించబోతోంది.

Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

హాలీవుడ్ లో అటు ఓటీటీ, ధియేటర్లో రిలీజ్ కు లైనప్ అయ్యాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడట్, కెన్నత్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ డెత్ ఆన్ ద నైల్ ఫిబ్రవరి 11న ధియేటర్లో రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఇన్వెంటింగ్ అన్నా అనే ఇంట్రస్టింగ్ హాలీవుడ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబతోంది.