Bappi Lahiri : బప్పీ లహరి ఇచ్చిన తెలుగు సూపర్ హిట్ పాటలు ఇవే!

కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినా.. అందులో ఆడియో మాత్రం సూపర్ హిట్ అంటే బప్పీ లహరి వేసిన మార్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Bappi Lahari Telugu

Bappi Lahiri : భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరితో తెలుగు సినీ పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగులో అగ్రహీరోల సినిమాల్లో బప్పీలహరి ఎవర్ గ్రీన్ పాటలు అందించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు సినిమాలకు ఎక్కువగా బప్పీ లహరి పనిచేశారు. కొన్ని సినిమాలు అంతగా ఆడకపోయినా.. అందులో ఆడియో మాత్రం సూపర్ హిట్ అంటే బప్పీ లహరి వేసిన మార్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Read This : BappiLahiri-Chiru : చిరంజీవికి లైఫ్ టైం బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బప్పీ లహరి

తెలుగులో ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు వర్క్ చేశారు బప్పీదాదా. 1986లో సింహాసనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తేనె మనసులు, శంఖారావం, సామ్రాట్(రమేశ్ బాబు), కలెక్టర్ విజయ(నరేశ్-విజయ నిర్మల), ఇంద్ర భవనం, రక్త తర్పణం మూవీస్ చేశారు.

బాలకృష్ణ హీరోగా నటించిన ట్రేడ్ మార్క్ మూవీ రౌడీ ఇన్ స్పెక్టర్ కు బప్పీ దాదా ఇచ్చిన మ్యూజిక్ ఆ మూవీని మ్యూజికల్ హిట్ గా నిలిపింది. నిప్పు రవ్వ మూవీ డిజాస్టర్ అనిపించుకున్నా సాంగ్స్ మాత్రం హిట్టయ్యాయి.

Read This : Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత

మోహన్ బాబుతో రౌడీ గారి పెళ్లాం, బ్రహ్మ, పుణ్యభూమి నాదేశం సినిమాలకు సంగీతం అందించారు బప్పీ లహరి. ఈ పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి.

తెలుగులో చివరిసారిగా ఇటీవల రవితేజ హీరోగా రిలీజైన “డిస్కో రాజా” సినిమాలోని “ఫ్రీక్ అవుట్” సాంగ్ ను బప్పీలహరి పాడారు. ఈ పాట కూడా పాపులర్ అయింది.