Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూశారు.

Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత

Buppy

Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూశారు. హిందీ, తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన బప్పీ లహరి డిస్కో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. బప్పి లహరి ఈరోజు(16 ఫిబ్రవరి 2022) ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో మరణించారు. బప్పి లాహిరికి 69 ఏళ్లు. రాత్రి 11 గంటల సమయంలో బప్పీ లాహరి మరణించినట్లు చెబుతున్నారు. బప్పీ లాహరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒంటి నిండా బంగారం వేసుకుని కనిపించడం.. ఎప్పుడూ బంగారు కడియాలు ధరించడం చాలా ఇష్టం. మెడలో పెద్ద బంగారు గొలుసు, చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు వేసుకునేవారు. తెలుగులో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ తెలుగు నటుల సినిమాలకు సంగీతం అందించారు. సింహాసనం (1986), స్టేట్ రౌడీ, సామ్రాట్ (1990), గ్యాంగ్ లీడర్ (1991), రౌడీ అల్లుడు (1991), రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992) వంటి సినిమాలకు బప్పీ లహరి సంగీతం అందించారు.

బప్పి లాహిరి 1952లో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో శాస్త్రీయ సంగీతం నేర్పించే సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో సంగీత దర్శకునిగా వృత్తిని ప్రారంభించాడు. అతని తండ్రి, అపరేష్ లహరి ప్రసిద్ధ బెంగాలీ గాయకుడు, అతని తల్లి, బన్సారి లహరి సంగీత విద్వాంసురాలు. అతనికి తల్లిదండ్రులే సంగీతంలో శిక్షణ ఇచ్చారు. 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బప్పీ లహరి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్నారు.