సుశాంత్ సూసైడ్ వెనుక ఉన్న 10 మంది.. వాళ్లెవరు? సెన్సేషనల్ ట్విస్ట్

సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి.. ఆ కేసు ఇప్పటివరకు ఎన్నో టర్న్‌లు తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు.. అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరే రోజూ వినిపిస్తోంది. కానీ.. ఈ కేసులో రియా మాత్రమే లేదు. సుశాంత్ మరణం తర్వాత.. మరో 10 మంది సుశాంత్ మిస్టరీ డెత్ కేసులో హాట్ టాపిక్‌గా మారారు. వాళ్లెవరు.? సుశాంత్‌కి వాళ్లకు ఉన్న సంబంధమేంటి? ఇంటరాగేషన్‌లో వాళ్లేం చెప్పారు?
ఇప్పుడివే ప్రశ్నలు.. అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయ్. పూటకో మలుపు.. రోజుకో ట్విస్ట్.. గంటకో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుండటంతో.. చాలా వరకు పబ్లిక్ అటెన్షన్ అంతా ఈ కేసుపైనే ఉంది. అందుకే.. సుశాంత్ మిస్టరీ డెత్‌కు సంబంధించిన చిన్న విషయం కూడా.. నేషన్ వైడ్ హాట్ టాపిక్‌గా మారుతోంది.
సుశాంత్‌ని చంపేశారని.. అతని డబ్బు దోచుకున్నారని.. డ్రగ్స్ అలవాటు చేశారని.. ఇలా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. అప్పటి నుంచి.. ఈ కేసు అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టే ప్రధానంగా తిరుగుతోంది. ఇందులో.. ప్రధాన నిందితురాలిగా కొనసాగుతోంది. ముఖ్యంగా సుశాంత్ కుటుంబం అతని ప్రేమికురాలు రియా చక్రవర్తి మీదే ఆరోపణలు చేస్తోంది.
ప్రస్తుతం.. సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా రియా చక్రవర్తిని ప్రశ్నించింది. సుశాంత్‌తో పరిచయం ఎలా ఏర్పడింది.. ఆ పరిచయం ఎక్కడి వరకెళ్లింది.. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారా.. చివరిగా అతనితో ఎప్పుడు మాట్లాడింది.. సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో నుంచి డబ్బు ఎవరెవరి ఖాతాలకు వెళ్లింది.. లాంటి ప్రశ్నలను సీబీఐ సంధించినట్లు సమాచారం.
ఐతే.. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రియా చక్రవర్తి చాలా విషయాలే చెప్పారు. సుశాంత్ చనిపోవడానికి ఆరు రోజుల ముందు రియా చక్రవర్తి అతని ఇంటి నుంచి బయటకొచ్చేసింది. సుశాంత్ ఇంటి నుంచి బయటకు రావడానికి గల కారణాల గురించి రియా చెప్పింది.
సుశాంత్ తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరినప్పటికీ.. ఆ తర్వాతి రోజు చివరి మెసేజ్ చేశాడని రియా తెలిపింది. ఆ తర్వాత.. కోపంలో సుశాంత్ నెంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు చెప్పింది రియా. సుశాంత్ తన సోదరి మీతు సింగ్ వస్తున్నారని చెప్పి.. తనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినట్లు తెలిపింది రియా. ఐతే.. సుశాంత్ సోదరి.. సుశాంత్‌తో పాటు ఉంటేనే.. తాను ఇంటినుంచి బయటకు వెళ్తానని చెప్పిందట రియా. కానీ.. అందుకు సుశాంత్ ఒప్పుకోలేదని.. ఆమె రాకముందే.. తనను వెళ్లిపోవాలని చెప్పినట్లు ఇంటర్వ్యూలో తెలిపింది.
జూన్ 8న రియా.. సుశాంత్ ఇంటినుంచి బయటకొచ్చేసింది. జూన్ 9న.. సుశాంత్ రియాకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత.. రియా సుశాంత్ నెంబర్‌ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినప్పటికీ.. సుశాంత్ రియా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో కొనసాగాడు. రియా సోదరుడు షోవిక్‌తో.. సుశాంత్ సన్నిహితంగా మెలిగేవాడని చెప్పుకొచ్చింది. సుశాంత్ జూన్ 10న.. రియా బ్రదర్ షోవిక్‌కి మెసేజ్ చేశాడు. రియా ఎలా ఉంది.. తనెప్పుడు బాగుంటుందో చెప్పండంటూ కోరాడు. ఆ తర్వాత.. 4 రోజులకే ముంబైలోని తన నివాసంలో సుశాంత్ మృతి చెందాడు.
సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడంపైనా.. రియా స్పందించింది. సుశాంత్ చనిపోయాడని తెలిసి.. తాను షాక్‌కు గురయ్యానని చెప్పింది రియా. అసలేం జరిగిందో తనకర్థం కాలేదని.. అంత్యక్రియలకు హాజరయ్యే వారి లిస్టులో తన పేరు లేదని తెలిపింది. ఇండస్ట్రీకి చెందిన ఇతరుల పేర్లు ఉన్నాయని.. తన పేరు లేకపోవడం వల్లే తాను సుశాంత్ ఫనరల్స్‌కి హాజరుకాలేకపోయానని చెప్పింది.
సుశాంత్ ఫ్యామిలీకి తానంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు ఆహ్వానించిన వారి లిస్టులో తన పేరు చేర్చలేదని చెప్పుకొచ్చింది రియా. సుశాంత్ గంజాయి, సిగరెట్ తాగేవాడని.. వద్దని ఎంత వారించినా వినలేదని రియా చెప్పుకొచ్చింది. సుశాంత్ తనకు నచ్చిన పని చేస్తానంటూ.. తేల్చి చెప్పాడని ఇంటర్వ్యూలో తెలిపింది.
సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా తాను అపాయింట్ చేయలేదని చెప్పింది. శామ్యూల్‌ని.. సుశాంత్ చెల్లెలు ప్రియాంకాసింగ్ నియమించినట్లు స్పష్టం చేసింది. ఏదేమైనా.. సుశాంత్ మిస్టరీ డెత్ కేసులో రియా చక్రవర్తే సెంటర్ పాయింట్‌గా కనిపిస్తోంది. అందుకే.. సీబీఐ రియాపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.