Bellamkonda Sai Srinivas : గజదొంగ బయోపిక్‌లో బెల్లంకొండ.. టైటిల్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. లక్ష్మి గణపతి నిర్మాణ సంస్థ సారథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖదొంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తుండగా దొంగపాత్రలో శ్రీనివాస్ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. తెలుగు ఛత్రపతికి హిందీలో రీమేక్ చేస్తుండగా అందులో శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు.
- kunduru Vinod
- Published On : August 11, 2021 / 08:20 PM IST
Bellamkonda Sai Srinivas
Bellamkonda Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీనుతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ హిట్ కోసం శ్రీనివాస్ ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కథల ఎంపికలో బిజీ అయిపోయారు. మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన `ఛత్రపతి` బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా శ్రీనివాస్ తెలుగులో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోగ్రఫీ ఆధారంగా ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే టైటిల్ తో దర్శకుడు ఎ.ఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రెస్టీజియస్ బ్యానర్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
కాగా నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా తప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు `టైగర్` అనే పేరు వచ్చింది. పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాలతో `స్టూవర్టుపురం దొంగ` సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.
