Chatrapathi : ఛత్రపతి హిందీ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా.. పాపం బెల్లంకొండ..

బాలీవుడ్ యూట్యూబ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి రికార్డులు ఉండటంతో ఆ నమ్మకంతోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు.

  • Published On : May 14, 2023 / 12:48 PM IST

Bellamkonda Sreenivas Chatrapathi Movie collections

Bellamkonda Sreenivas : రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి(Chatrapathi)ని 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హిందీలో(Hindi) రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా, VV వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేశారు. ఇందులో నుశ్రుత్ భరూచా(Nushrratt Bharuccha) హీరోయిన్ గా నటించింది.

బాలీవుడ్ యూట్యూబ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి రికార్డులు ఉండటంతో ఆ నమ్మకంతోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు దాదాపు 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయింది. దీంతో ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు. కానీ సినిమా రిలీజయ్యాక సీన్ రివర్స్ అయింది.

ఛత్రపతి సినిమా బాలీవుడ్ లో మే 12న భారీగా దాదాపు 2300 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు ఈ సినిమాకు ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి కేవలం ఒక కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అంటే దాదాపు 60 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండో రోజు అయితే మరీ దారుణంగా పడిపోయి 80 లక్షల గ్రాస్ కలెక్షన్స్, 45 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో చిత్రయూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. ఇలా అయిపోయింది ఏంటి అని ఆలోచిస్తున్నారు.

Chatrapathi Remake : ఛత్రపతి రిజల్ట్ ఏంటి.. బాలీవుడ్‌లో బెల్లంకొండ హిట్టా? ఫట్టా?

ఎన్నో ఆశలతో బెల్లంకొండ శ్రీనివాస్ గ్రాండ్ గా తన హిందీ డెబ్యూట్ ప్లాన్ చేసుకుంటే కనీసం ఓపెనింగ్స్, తెలుగులో ఓ చిన్న హీరోకి వచ్చే అంత కూడా రాలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది పాపం అని అంటుంటే, కొంతమంది యూట్యూబ్ లో రికార్డులు చూసుకొని ఫ్యాన్స్ ఉన్నారేమో అనుకోని బాలీవుడ్ అనవసరంగా వెళ్ళాడు అని.. ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఛత్రపతి డిజాస్టర్ అవ్వడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టం మిగిలింది. మరి బెల్లంకొండ నెక్స్ట్ సినిమా ఎక్కడ ప్లాన్ చేస్తాడో చూడాలి.