Bellamkonda Srinivas : విజయ్ దేవరకొండ సేఫ్.. రష్మికతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ హీరో..
కొన్ని రోజుల క్రితం రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నాయని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ లో మీడియా దీని గురించి అడగగా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.
- Saketh U
- Published On : May 4, 2023 / 09:40 AM IST
Bellamkonda Srinivas gives clarity on dating with Rashmika
Bellamkonda Srinivas : అల్లుడు శీను(Alludu Seenu), జయజనకి నాయక, అల్లుడు అదుర్స్.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ఇప్పుడు హిందీలో లాంచ్ అవ్వబోతున్నాడు. ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి(Chatrapathi) సినిమాని బాలీవుడ్(Bollywood) లోకి రీమేక్ చేస్తున్నాడు శ్రీనివాస్. VV వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్ తెరకెక్కింది. మే 12న ఈ సినిమా హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నాయని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇటీవల నెల రోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అలా రెండు సార్లు కనిపించారు. ఇద్దరు కలిసి రావడం, కలిసి వెళ్లడంతో పాటు ఓ బాలీవుడ్ అవార్డు వేడుకలో ఇద్దరూ బాగా క్లోజ్ గా కనిపించడంతో బాలీవుడ్ మీడియా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అని వార్తలు రాశారు. తాజాగా ఛత్రపతి సినిమా ప్రమోషన్స్ లో మీడియా దీని గురించి అడగగా శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.
రష్మికతో డేటింగ్ పై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందిస్తూ.. మేమిద్దరం ప్రేమలో, డేటింగ్ లో వస్తున్న వార్తలు అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు. మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉండేది. రెగ్యులర్ గా ముంబైకి షూటింగ్ కి వస్తున్నాం. అలా వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నాం. అవి అనుకోకుండా జరిగినవే. అంత మాత్రానికే ఇలాంటివి రాస్తారా? ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని అన్నారు. దీంతో రష్మికతో బెల్లంకొండ డేటింగ్ పై క్లారిటీ వచ్చేసింది.
Jagapathi Babu : నన్ను సెట్ ప్రాపర్టీగా భావిస్తున్నారు.. కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదు..
అయితే విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ చేసిందని, వారిద్దరూ ప్రేమలో ఉన్నారని మన టాలీవుడ్ మీడియా, అభిమానులు ఎప్పట్నుంచో అంటున్నా వీరి రిలేషన్ ఏంటో ఇప్పటికి క్లారిటీ రాలేదు.
