Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మహిళ అరెస్ట్.. ముంబైలో దాడి.. బెంగాల్ లో అరెస్ట్..

తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు బెంగాల్ లో ఓ మహిళను అరెస్ట్ చేసారు.

Bengal Women Arrested in Saif Ali Khan Attacking Case

Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే షరీఫుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే, అతనిని పోలీస్ రిమాండ్ లో ఉంచి విచారిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సైఫ్ ఇంట్లో వేలిముద్రలు పోలీసులు పట్టుకున్న నిందితుడి వేలిముద్రలతో సరిపోవడం లేదని తెలుస్తుంది. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకునేలా ఉంది. పోలీసులు పట్టుకున్నది అసలైన నిందితుడు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు బెంగాల్ లో ఓ మహిళను అరెస్ట్ చేసారు. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ కి చెందిన వ్యక్తి అని, అక్రమంగా ఇండియాలోకి వచ్చాడని విచారణలో తేలింది. అతను వాడిన సిమ్ కార్డు బెంగాల్ నడియాలోని ఓ మహిళా పేరు మీద ఉండటంతో ఇద్దరు పోలీసులు బెంగాల్ వెళ్లి అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసి ఆ మహిళను పట్టుకున్నారు. ఆమె పేరు కుఖుమోని జెహాంగీర్ షేక్. ఆమెను అరెస్ట్ చేసి బెంగాల్ పోలీసుల సహాయంతో ఆమెను రిమాండ్ లోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారని సమాచారం.

Also See : Anasuya Bharadwaj : హైదరాబాద్ నుమాయిష్‌లో అనసూయ షాపింగ్.. గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్‌తో.. ఫొటోలు చూశారా?

పోలీసులు ముంబై లో అరెస్ట్ చేసిన షరీఫుల్ బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ ద్వారా అక్రమంగా ఇండియాలోకి చొరబడి ఈమెని పరిచయం చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. సైఫ్ పై దాడి చేసిన నిందితుడి వేలిముద్రలు సైఫ్ ఇంట్లో దొరకకపోవడం, ఇప్పుడు మరో మహిళను అరెస్ట్ చేయడంతో సైఫ్ కేసు కొత్త మలుపులు తీసుకుంటుందని తెలుస్తుంది. అలాగే షరీఫుల్ కి ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు.

Also Read : Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో ఆడుకుంటున్న నెట్‌ఫ్లిక్స్.. పుష్ప 2 ఓటీటీ రిలీజ్ పై మళ్ళీ కన్ఫ్యూజన్..

నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జనవరి 16న తెల్లవారుజామున దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. అయిదు రోజులు హాస్పిటల్ లో ఉండి పలు సర్జరీల అనంతరం సైఫ్ ఇటీవల జనవరి 21న డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం సైఫ్ ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు.