Bhamakalapam Event
Bhama Kalapaam: బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరే ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ప్రేక్షకులకు వినోదాన్నందించే విషయంలో ఎప్పటికప్పుడు తనతో తానే పోటీ పడుతూ తనకు తానే సాటిగా నిరూపించుకుంటున్న ‘ఆహా ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ను తమ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జూడ్’..
ప్రతి వారం ఓ సరికొత్త సినిమాను ఆడియన్స్ అందిస్తున్న ‘ఆహా’ ఫిబ్రవరి 11న మరో క్రేజీ మూవీ తీసుకొస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి మెయిన్ లీడ్‌గా.. డైరెక్టర్ భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్) సమర్పణలో, అభిమన్యు దర్శకత్వంలో, SVCC Digital బ్యానర్ మీద భోగవల్లి బాపినీడు, ఈదర సుధీర్ నిర్మిస్తున్న ఫిలిం.. ‘భామా కలాపం’ (A Delicious Home Cooked Thriller) ట్యాగ్ లైన్.
ఇటీవల రిలీజ్ టీజర్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో పాటు మూవీ మీద హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘భామా కలాపం’ ట్రైలర్ లాంచ్ చెయ్యబోతున్నారు. ‘ఆహా’ ఒరిజినల్ ఫిలిం ‘భామా కలాపం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జనవరి 31 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, పార్క్ హయత్‌లో జరుగబోతుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు.