Bharathiraja-Rajinikanth : రజినీకాంత్ భారతీరాజా వివాదం.. రజనీని ఎంత చిన్నచూపు చూసారో తెలుసా..?

భారతీరాజాకు రజినీకాంత్ కి మధ్య పెద్ద వివాదమే ఉంది. (Rajinikanth)

  • Updated on- June 10, 2026 / 11:19 AM IST

Bharathiraja Criticize Rajinikanth

Rajinikanth-Bharathiraja: ఎన్నో సినిమాలతో మెప్పించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా పలు ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యంతో బాధపడుతూ నేడు ఉదయం మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. అయితే భారతీరాజాకు – రజినీకాంత్ కి మధ్య పెద్ద వివాదమే ఉంది.

భారతీరాజా దర్శకత్వంలో రజినీకాంత్ 16 వయతినిలే (పదహారేళ్ళ వయసు), కోడి పరాకుత్తు అనే రెండు సినిమాల్లో నటించారు. భారతీరాజా బహిరంగంగా రజినీకాంత్ పై అనేకమార్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా రజినీకాంత్ కర్ణాటక వ్యక్తి అవ్వడంతో అతను తమిళ వ్యక్తి కాదంటూ అనేక వివాదాల్లో ఆయన పేరుని ప్రస్తావించారు భారతీరాజా.

Also Read : చివరి సినిమాలో మరణం.. ఇప్పుడు రియల్ లైఫ్ లో..

తమిళనాడు – కర్ణాటక కావేరి జలాల వివాదాలు జరిగినప్పుడు తమిళ నటులు కూడా కావేరి జలాల కోసం దీక్ష చేశారు. అప్పుడు జరిగిన నిరసనలు ఘర్షణకు దారి తీయడంతో పలువురు పోలీసులపై దాడి చేశారు. పోలీసులపై దాడిని రజినీకాంత్ విమర్శించారు. దీంతో భారతీరాజా.. అతను కర్ణాటక వాడు. అందుకే తమిళనాడు జలాల కోసం పోరాడట్లేదు. తమిళులపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నావు అంటూ విమర్శలు చేశారు.

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు, పార్టీ పెడతారు అనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా.. పార్టీ పెట్టొచ్చు కానీ ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వకూడదు. తమిళ్ వాళ్ళను తమిళులే పరిపాలించాలి అంటూ రజినీపై విమర్శలు చేశారు. 2017లో కూడా ఓ వివాదంలో రజినీకాంత్ పై అసభ్యకర మాటలతో మీడియా ముందే విమర్శలు చేశారు. ఆయన జాతి, రాష్ట్రాన్ని గుర్తుచేస్తూ అనేక మార్లు భారతీరాజా రజినీకాంత్ పై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

Also Read :  ఏడాది క్రితం గుండెపోటుతో కొడుకు మరణం.. ఆ బాధతోనే భారతీరాజా..

భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజిని ఆయనను డైరెక్ట్ గా ఎప్పుడూ ఏమి అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజిని. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజిని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు.