Bharathiraja : చివరి సినిమాలో మరణం.. ఇప్పుడు రియల్ లైఫ్ లో..
చివరగా నటించిన సినిమాలో భారతీరాజా మరణించే పాత్ర చేశారు. (Bharathiraja)
Bharathiraja
Bharathiraja : దిగ్గజ దర్శకుడు భారతీరాజా నేడు ఉదయం మరణించారు. తమిళ్, తెలుగు, హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసి, మరెన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఆయన వయసు పైబడినా ఓపిక ఉన్నంత కాలం నటించారు. ఆయన చివరగా నటించిన సినిమా మలయాళం ‘తుడరం’. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో భారతీరాజా వయసు అయిపోయి రిటైర్మెంట్ తీసుకున్న ఓ ఫైట్ మాస్టర్ గా, మోహన్ లాల్ గురువుగా కనిపిస్తారు. ఈ సినిమాలో భారతీరాజా తన ఏజ్ కి తగ్గ పాత్రలో ఓపిక చేసుకొని నటించినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర మరణిస్తుంది.
Also Read : Bharathiraja : ఏడాది క్రితం గుండెపోటుతో కొడుకు మరణం.. ఆ బాధతోనే భారతీరాజా..
అలా చివరగా నటించిన సినిమాలో భారతీరాజా మరణించే పాత్ర చేశారు. కానీ భారతీరాజా చివరి సినిమాగా రిలీజ్ అయింది మాత్రం దేశీయ తలైవర్. తుడరం సినిమా తర్వాత ఆయన మళ్ళీ నటించలేదు. గతేడాది మార్చ్ లో తన కొడుకు మనోజ్ గుండెపోటుతో మరణించడంతో ఆయన సినిమాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు.
