Aha OTT : ‘ఆహా’లో ఒకేసారి రెండు సినిమాలు స్ట్రీమింగ్..

ఈ వారం కూడా ఆహాలో ఒక డబ్బింగ్ సినిమాతో పాటు ఒక తెలుగు సినిమా స్ట్రీమింగ్ కి వచ్చాయి.

Bhargavi Nilayam and Simbaa Movies Streaming in Aha OTT

Aha OTT : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా సినిమాలు, షోలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల కోసం ప్రతి వారం మంచి మంచి డబ్బింగ్ సినిమాలని తీసుకొస్తున్నారు. ఈ వారం కూడా ఆహాలో ఒక డబ్బింగ్ సినిమాతో పాటు ఒక తెలుగు సినిమా స్ట్రీమింగ్ కి వచ్చాయి.

Also Read : 35-Chinna Katha Kaadu : ’35 చిన్న కథ కాదు’ మూవీ రివ్యూ.. పిల్లలు, పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

మలయాళంలో సూపర్ హిట్ అయిన నిలవేలిచాం సినిమా ఇప్పుడు తెలుగులో భార్గవి నిలయం అనే పేరుతో స్ట్రీమింగ్ అవుతుంది. టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో పలువురు ముఖ్య పాత్రల్లో హారర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ రచయిత కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న భార్గవి నిలయం అనే పాత ఇంట్లోకి వస్తే, అక్క ఒక ఆత్మ ఉందని అంతా అంటుంటారు. ఇలా ఒక ఇంట్లో ఆత్మ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులని భయపెడుతుంది ఈ భార్గవి నిలయం సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లో కూడా భవాని మీడియా ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇటీవల అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సింబా’ ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజయింది. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణంలో కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సింబా సినిమా తెరకెక్కింది. ప్రకృతి, మొక్కలు, సెల్యులార్ మెమరీ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని ఒక రివెంజ్ డ్రామాలా తెరకెక్కించారు. సింబా సినిమా నేడు సెప్టెంబర్ 6 నుంచి ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు