Bhavana Lasya : నాన్నకు మందు బాటిల్ తీసుకెళ్తా.. గోవాలో అమ్మ నాన్నతో కలిసి పబ్‌కి.. సీరియల్ నటి ఆసక్తికర కామెంట్స్..

ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలు తెలిపింది. (Bhavana Lasya)

  • Published on- November 2, 2026 / 04:54 PM IST

Bhavana Lasya

Bhavana Lasya : మల్లి, లక్ష్మి నివాసం సీరియల్స్ తో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి భావన లాస్య. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సీరియల్స్ చేస్తుంది ఈ భామ. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తన పేరెంట్స్ తోనే పార్టీలు ఎంజాయ్ చేస్తాను అని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Also Read : Bhavana Lasya : కాస్టింగ్ మేనేజర్ కాల్ చేసి బిజినెస్ మెన్‌ని కలుస్తావా అని.. కమిట్మెంట్ పై సీరియల్ నటి కామెంట్స్ వైరల్..

భావన లాస్య మాట్లాడుతూ.. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఏమున్నా మా పేరెంట్స్ తోనే ఎంజాయ్ చేస్తాను. థాయ్ లాండ్ కి మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను. మా నాన్నకు అదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నేను ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళను. గోవాకి కూడా మా ఫ్యామిలీతోనే వెళ్ళాను. గోవాలో పబ్ కి తీసుకెళ్ళాను మా అమ్మ, నాన్నలను. వాళ్ళు చిన్న పిల్లలు అయిపోతారు. వాళ్ళపై మనం కేర్ తీసుకోవాలి.

హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మందు బాటిల్ తీసుకెళ్తాను నాన్నకు. నాన్నని నువ్వే చెడగొడుతున్నావ్ అని అంటుంది అమ్మ. మనం ఎదుగుతున్నాం, వాళ్ళు అనుభవించనివి, చూడనివి చూపించాలని చేస్తాను నేను. అందుకే వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాను. పార్టీలకు వెళ్తే నాన్నని తీసుకెళ్తాను. నాన్న రైల్వేయ్ ఎంప్లాయ్ అని తెలిపింది.