Ah Trailer : ‘అ’ ట్రైలర్ రిలీజ్.. అమ్మాయిల మిస్సింగ్ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్..
మీరు కూడా అ ట్రైలర్ చూసేయండి.. (Ah Trailer)
Ah Trailer
Ah Trailer : రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అ’. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ BH నిర్మాణంలో సాయి బాలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నవంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈవెంట్ కి డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అమ్మాయిలు మిస్సింగ్, వాళ్ళ బాడీ పార్ట్స్ దొరకడం, ఓ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని తీసుకోవడం. వంటి అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా అ ట్రైలర్ చూసేయండి..
Also Read : Jabardasth Varsha : సీరియల్స్ ఎందుకు మానేసిందో చెప్పిన జబర్దస్త్ వర్ష.. పాపం..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నందినీ రెడ్డి మాట్లాడుతూ.. థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతుంటాయి. ‘అ’ కూడా అలాగే అవ్వాలి. నాకు రాహుల్ మంచి స్నేహితుడు. మేం ఇద్దరం కలిసి ఇది వరకే పని చేశాం. రాహుల్ చాలా మంచివాడు. అతడికి సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు అని అన్నారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ.. రాహుల్ నాకు చాలా ఏళ్ల నుంచి స్నేహితుడు. అ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. అర్చన గారి సక్సెస్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. చిన్నప్పుడే నేను రాహుల్ టాలెంట్ చూసి షాక్ అయ్యాను. రాహుల్ కష్టాన్ని దగ్గరుండి చూశాను. రాహుల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను అని అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. శ్రీ చరణ్ బీజీఎం నాకు చాలా ఇష్టం. టీజర్, ట్రైలర్ నచ్చాయి. పోస్టర్ డిజైనింగ్, టైటిల్లోనే సినిమా కథను చెప్పడం బాగుంది. ఇండస్ట్రీలో ఇలాంటి నూతన దర్శక, నిర్మాతలు రావాలి. ‘శంబాల’తో అర్చన మంచి విజయాన్ని అందించింది. అదే సక్సెస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. రాహుల్ చాలా మంచి వ్యక్తి. ఇందులో అతని స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే ఈశ్వర్ లో ప్రభాస్‌లా కనిపించారు. అని అన్నారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. అ డార్క్ క్రైమ్ జానర్లో ఉంటుంది. మీరు థియేటర్లో కూర్చున్న తర్వాత ఒక్క నిమిషం కూడా బోరింగ్‌గా అనిపించదు. మూవీ నచ్చితే ఓ పది మందికి చెప్పండి. మా డైరెక్టర్ సాయి గోల్డ్ మెడలిస్ట్. అతనికి సినిమాలంటే పిచ్చి. ఈ సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కాలి. ఈ కథ అంతా అర్చనా గారి చుట్టూనే తిరుగుతుంది అని తెలిపారు. అర్చనా అయ్యర్ మాట్లాడుతూ.. అ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రతీ అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్ చేసేలా ఉంటుంది అని తెలిపారు. దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. అ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది అని తెలిపారు.
