Bheemla Nayak: ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. దద్దరిల్లాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం

Bheemla Nayak

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ అండ్ పోస్టర్ తో మేకర్స్ అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో నెక్స్ట్ అప్డేట్ ఇప్పుడా అని పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు మేకర్స్ నుండి ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది.

భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు. ఇప్పటికే ఈ వేడుకకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి మరింత పండగలా మార్చేందుకు భీమ్లా నాయక్ మేకర్స్ కూడా గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 ఉదయం 11:16 గంటలకు భీమ్లా నాయక్ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల చేయనున్నారు.

భీమ్లా నాయక్ సినిమా నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ ట్విట్టర్ ఖాతా నుండి ఈ ప్రకటన వచ్చింది. పవర్ డే రోజున రీ సౌండింగ్ పవర్ ఆంతెంను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దంగా ఉండండి అంటూ యూనిట్ బిగ్ గిఫ్ట్ ఇచ్చేసింది. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.