×
Ad

Bheems Ceciroleo: బాలీవుడ్ లో భీమ్స్ ఎంట్రీ.. ఇక మాస్ బీట్స్ తో బీ టౌన్ షేక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo).

Bheems Ceciroleo composing music for a Bollywood film.

  • బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న భీమ్స్
  • కన్ఫర్మ్ చేసిన హీరో రవితేజ
  • త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది

Bheems Ceciroleo: సినిమా ఇండస్ట్రీ అనేది.. ఎప్పుడు.. ఎవరికీ.. ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఇక్కడ కష్టంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే కెరీర్ కష్టమే. ఇప్పుడు అదే స్టేజిలో ఉన్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన కంపోజ్ చేసినా పాటలే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈయన మ్యూజిక్ అందించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా, ఆ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

నిజానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇక ఇదే సీజన్ లో భీమ్స్(Bheems Ceciroleo) మ్యూజిక్ అందించిన మరో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవి తేజ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు భీమ్స్. అయితే, ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న భీమ్స్ కి ఈసారి బంపర్ ఆఫర్ దక్కిందట. ఏకంగా బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడట భీమ్స్.

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ.. బ్లాంక్ చెక్స్ ఇస్తున్న నిర్మాతలు.. కానీ, ఆయనతోనే సినిమా చేస్తాడట

ఈ విషయాన్ని స్వయంగా హీరో రవి తేజ చెప్పడం గమనార్హం. రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో రవి తేజ మాట్లాడుతూ.. “మా సినిమాకు భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. కానీ, ఇవాళ ఇక్కడికి రాలేకపోయాడు. ప్రస్తుతం అతను ముంబైలో బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే పనిలో ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో భీమ్స్ బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

నిజానికి, భీమ్స్ గీత రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ముందు కొన్ని సినిమాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో చనిపోదాం అని అనుకున్నాడట భీమ్స్. ఆ తరువాత వచ్చిన ధమాకా సినిమాతో అతని లైఫ్ టర్న్ అయ్యింది. అక్కడినుంచి వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు భీమ్స్. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాకు మ్యూజిక్ అందించే రేంజ్ కి వెళ్ళాడు. అయితే, ఆ సినిమా ఏది, హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.