ChiranJeevi: అపార్థం చేసుకున్నారు.. నిజానికి చిరంజీవి అసలు ఏమన్నారో తెలుసా?

అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి? అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

ChiranJeevi

Bholaa Shankar – ChiranJeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఈ నెల 11న విడుదల కావాల్సి ఉన్న వేళ చెలరేగుతున్న వివాదంపై చిరు టీమ్, అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైజె రాంబాబు పేరిట ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదలైంది.

తాజాగా, వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఏంటి? చాలా మంది అర్థం చేసుకున్న తీరు ఏంటి? అనే వివరాలను తెలిపారు. వాటి ప్రకారం చిరు ఏమన్నారంటే.. సినీ నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం తనకు చాలా బాధ కలిగిందని చిరు అన్నారు.

తాము నటించేది సినీ పరిశ్రమలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసమేనని, ఎన్ని సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది తమ ఉద్దేశమని చెప్పారు. తాను దేశ రాజకీయాలు చూశానని, వాటి ముందు సినిమా రంగం చాలా చిన్నదని చెప్పారు.

తమ యాక్టింగ్ నచ్చితే అభినందించాలని, కానీ రాజకీయాలతో ముడిపెట్టి చూడకూడదని అన్నారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి? అని చిరంజీవి వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 11న భోళాశంకర్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ అనుమతి దక్కలేదు.

Bholaa Shankar: చిరంజీవి భోళా శంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్