Drishyam 3: దృశ్యం 3 అప్డేట్ ఇచ్చన దర్శకుడు.. ఆడియన్స్ కి ఆ విషయంలో నిరాశే.. ఇంకేముంటది మరి?
దృశ్యం.. అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కున్న(Drishyam 3) తన ఫ్యామిలీ కోసం ఒక తండ్రి ఎంతవరకైనా వెళ్తాడు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ నీ విపరీతంగా ఆకట్టుకుంది.

Director Jeethu Joseph gives an update about Drishyam 3
Drishyam 3: దృశ్యం.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కున్న తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి ఎంతవరకైనా వెళ్తాడు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇండియాలోని ఆడియన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మొదట మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో రీమేక్ అయ్యింది. అన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 కూడా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 3(Drishyam 3)ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు జీతూ జోషఫ్.
Vijay Polaki: ఈ కట్టె కాలే వరకూ మీ ఫ్యాన్‌నే.. నా జన్మ ధన్యం అయింది: విజయ్ పొలాకి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దృశ్యం 3 గురించి చెప్పుకొచ్చాడు. “దృశ్యం 3 తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ నాలుగేళ్లలో ఆయన పాత్రలో చాలా మార్పులు చేశాను. గత రెండు భాగాల కంటే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ, రెండో భాగంలో ఉన్నట్లు హై- ఇంటెలిజెన్స్ సన్నివేశాలు మాత్రం ఊహించుకోకండి. అలా అనుకుంటే నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఇది పూర్తి భిన్నమైన కథ” అంటూ చెప్పుకొచ్చాడు జీతూ జోసఫ్.
అయితే, దృశ్యం 3పై దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్, సినీ లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దృశ్యం సినిమాలో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్టులు కదా. మరి ఆ విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి అనడం ఎంత వరకు కరక్ట్. అసలు ఆ ఎలిమెంట్స్ లేకపోతే సినిమాలో ఇంకేం ఉంటుంది అంటూ నెగిటీవ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో, జీతూ జోసఫ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన ముందే మనకు హింట్ ఇస్తున్నారు అంటే తప్పకుండా ఎదో కొత్తగా ట్రై చేసి ఉంటారు అంటున్నారు. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయో తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే.