Bholaa Shankar: చిరంజీవి భోళా శంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..

Bholaa Shankar: చిరంజీవి భోళా శంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్

ChiranJeevi

Bholaa Shankar – Andhra Pradesh: మెగాస్టార్ చిరంజీవి (ChiranJeevi) నటించిన భోళా శంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh govt) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 11న భోళాశంకర్ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఈ సినిమా బృందం ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది.

అయితే, ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సరైన డాక్యుమెంట్లు జత చేయనందునే ఇంకా అనుమతి ఇవ్వలేదని అంటున్నాయి. భోళా శంకర్ సినిమా బడ్జట్ కు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లను ఆ మూవీ నిర్మాత పూర్తిగా ఇవ్వలేదని చెప్పాయి. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఆయనకు ఏపీ మంత్రులు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ మీడియా సమావేశాలు నిర్వహించారు. కాగా, భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. చిరంజీవితో పాటు తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా విడుదలకు ముందు చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై కక్ష సాధింపులో భాగంగానే భోళా శంకర్ సినిమా విడుదల విషయంలో వైసీపీ ఇబ్బందులు పెడుతోందని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సినిమాకు, చిరంజీవి కామెంట్స్ కు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సరైన డాక్యుమెంట్స్ ఇస్తే టికెట్ రేటు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది.

Naga babu: ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు అంటూ నాగబాబు సెటైర్లు.. సరిపోయారు ముగ్గురూ అంటూ నందిగం సురేశ్ ఎద్దేవా