Kartik Aryan : చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి హిట్ ఇచ్చినందుకు.. హీరోకి 5 కోట్ల కార్ ఇచ్చిన నిర్మాత
భూల్ భులాయా 2 సినిమా ఇప్పటిదాకా దాదాపు 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. 'భూల్ భులాయా 2' బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా
- Saketh U
- Updated on- June 25, 2022 / 07:59 AM IST
Kartik Aryan
Bhool Bhulaiyaa 2 : గత రెండేళ్లుగా బాలీవుడ్ కి ఒక్క సరైన హిట్ లేదు, మరో పక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ వాళ్ళకి ఏం చేయాలో అర్ధం కావట్లేదు. ఏ జోనర్ లో సినిమా చేసినా అది ప్లాప్ గానే మిగులుతుంది. హిట్స్ కోసం కాచుకు కూర్చున్న బాలీవుడ్ కి ఇటీవల ‘భూల్ భులాయా 2’ సినిమాతో భారీ విజయం లభించింది. యువ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టి బాలీవుడ్ కి ఊపిరి పోసింది.
భూల్ భులాయా 2 సినిమా ఇప్పటిదాకా దాదాపు 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ‘భూల్ భులాయా 2’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఇవ్వలేని సక్సెస్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఇవ్వడంతో అందరూ అభినందిస్తున్నారు. ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు నిర్మాత భూషణ్ కుమార్ హీరోకు ఖరీదైన బహుమతి ఇచ్చాడు.
VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..
మెక్లారెన్ జీటీ అనే స్పోర్ట్స్ కారును కార్తీక్ ఆర్యన్ కి నిర్మాత గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఖరీదు దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది. ఇండియాలో ఈ కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా కార్తీక్ నిలిచాడు. ఈ కారుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కార్తీక్. ట్విట్టర్ లో ఈ ఫోటోలు పోస్ట్ చేసి.. ”కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్లారెన్ జీటీ యజమానిని. నెక్స్ట్ టైం ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇవ్వండి సర్” అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
