VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..

మలయాళ సీనియర్‌ నటుడు వీపీ ఖలీద్‌ (70) షూటింగ్‌ లొకేషన్‌లోనే మరణించారు. శుక్రవారం కేరళలోని వయక్కం సమీపంలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అందులో..........

VP Khalid : షూటింగ్ సెట్ లో మరణించిన సీనియర్ నటుడు..

Vp Khalid

Updated On : June 25, 2022 / 7:25 AM IST

VP Khalid :  మలయాళ సీనియర్‌ నటుడు వీపీ ఖలీద్‌ (70) షూటింగ్‌ లొకేషన్‌లోనే మరణించారు. శుక్రవారం కేరళలోని వయక్కం సమీపంలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అందులో నటిస్తున్న ఖలీద్‌ ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. షూటింగ్ సిబ్బంది ఆయన్ని పిలవడానికి వెళ్లగా అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు అని వైద్యులు తెలిపారు. వీపీ ఖలీద్‌ మొదట్లో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసినా ఆ తర్వాత కొన్ని సీరియల్స్ తో ఆయనకి మంచి పేరు వచ్చింది. దీంతో సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు షైజు, జింసీ, ఖలీద్‌ రెహమాన్‌. వీరు ముగ్గురూ కూడా ఫిలిం ఇండస్ట్రీలోనే వేరు వేరు విభాగాల్లో రాణిస్తున్నారు. వీపీ ఖలీద్‌ మరణంతో మలయాళ సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.