Vishal – Arya Multistarrer: తమిళ యువ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నేడు (అక్టోబర్ 16) వీరిద్దరూ నటిస్తున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది విశాల్ 30వ చిత్రం అలాగే ఆర్య 32వ చిత్రం కావడం విశేషం.
విక్రమ్ ‘ఇంకొక్కడు’, విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. మిని స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రామోజీ ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశాల్ హీరోగా ఆర్య విలన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది.