బిగ్ బాస్ నుంచి ఆమె అవుట్!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 3కి వీకెండ్ వచ్చేసింది. మరో రెండు వారాలే మిగిలి ఉన్న ఈ సీజన్‌కు టాప్ 5లో ఎవరుంటారో సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారోననే ఉత్సుకత మొదలైంది. గత వారం బిగ్ బాస్ ఇచ్చే రూ.50లక్షల ప్రైజ్ ఎవరు అందుకుంటారని ఆడించిన టాస్క్‌ అనంతరం మహేశ్ విట్టా బయటకు వెళ్లిపోయాడు. 

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే క్యాండిట్ పట్ల ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ వారం నామినేషన్ లో ఏడుగురు క్యాండిట్లు ఉండటమే గమనార్హం. రెస్టారెంట్ టాస్క్ ఆడుతూనే కంటెస్టంట్ల అందరి తరపు వాళ్లు వచ్చి వెళ్తుంటే కంటెస్టంట్లు స్పందించిన తీరును బట్టి ఓటింగ్ సాగింది. 

దీనిపై నెటిజన్ల నుంచి పలు రకాలుగా స్పందన వ్యక్తమవుతుండటంతో దాదాపు వితికానే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అంచనా. శివజ్యోతి, వితికాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కాస్త నెగెటివిటీతో వితికాకు ఓటింగ్ తక్కువగా వచ్చి ఎలిమినేట్ అవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.