Bigg Boss 10 Telugu day 1 Promo : ఫ‌స్ట్ డే ప్రొమో వ‌చ్చేసింది.. తొలి రోజే హౌస్‌లో మొద‌లైన ర‌చ్చ‌.. రిషి సార్ ఫైర్‌..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో డే1కి (Bigg Boss 10 Telugu day 1 Promo) సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

Bigg Boss 10 Telugu day 1 Promo out now

Bigg Boss 10 Telugu day 1 Promo : ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10 ఆదివారం ప్రారంభ‌మైంది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా కంటెస్టెంట్‌లను పరిచయం చేసి, హౌస్ లోకి పంపించారు. సినీ నటులు, టీవీ స్టార్స్, కమెడియన్స్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సామాన్యులతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా.. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 6గురు వ‌చ్చారు.

తొలి రోజుకు సంబంధించిన ఫ‌స్ట్ ప్రొమో వ‌చ్చేసింది. 10 ప‌వ‌ర్స్‌లో త్రిగుణ్, ఝాన్సీ, ఆటో రామ్ ప్రసాద్, షాలిని, నరేష్, శ్రష్టి, ముఖేష్ గౌడ, వర్షిణి సుందరరాజన్ వంటి 8 మంది కంటెస్టెంట్స్ 8 పవర్స్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. మిగిలిన 2 పవర్స్ కోసం మిగిలిన ఇంటి స‌భ్యుల్లోంచి ఇద్ద‌రిని సెల‌క్ట్ చేయాల‌ని ఇప్ప‌టికే ప‌వ‌ర్స్ గెలిచిన వారిని బిగ్‌బాస్ ఆదేశించాడు.

Mary kom : బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టిన బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్‌.. తొలి రోజే గొడ‌వ‌.. ప్రియాంక చోప్రా వీడియో సందేశం..

ఇద్ద‌రిని ఎంపిక చేసే విష‌యంలో త్రిగుణ్‌, షాలిని, ముఖేష్ గౌడ మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు వ‌చ్చిన‌ట్లు ప్రొమోలో తెలుస్తోంది. అమ‌న్ గేమ్ ఆడ‌లేద‌ని వంశీ, కృష్ణుడుల‌ను త్రిగుణ్ సెలెక్ట్ చేశాడు. ప్ర‌తి ఒక్క‌రి పాయింట్స్ విన‌కుండా డెసిజ‌న్ తీసుకుంటున్నార‌ని షాలిని అంది. అన్నీ నాకే తెలుసు అనే దాంట్లో కొంచెం తొంద‌ర ప‌డ్డారేమో అని త‌న‌కూ అనిపించింద‌ని ముఖేష్ గౌడ్ చెప్పుకొచ్చాడు. మిగిలిన ప‌వ‌ర్ కోసం ఎంపిక అయిన ఇద్ద‌రు ఎవ‌రో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.