చిరు చేతుల మీదుగా బిగ్‌బాస్ టైటిల్!

బిగ్‌బాస్ 3 గ్రాండ్‌ ఫినాలేకు నిర్వాహకులు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించనున్నారని సమాచారం..

  • Publish Date - October 29, 2019 / 09:34 AM IST

బిగ్‌బాస్ 3 గ్రాండ్‌ ఫినాలేకు నిర్వాహకులు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించనున్నారని సమాచారం..

బిగ్‌బాస్ 3 ఫైనల్ విన్నర్ ఎవరు? అనే ఉత్కంఠకు మరో అయిదో రోజుల్లో తెరపడనుంది. బిగ్‌బాస్‌ తుది సమరానికి సిద్ధమవుతోంది. చివరి పోరులో ఎవరు గెలుస్తారు.. ఎవరు విజేతగా నిలుస్తారు.. ఎవరు వెనుదిరుగుతారనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ఫైనల్స్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

టాప్‌ 5లోకి ఎంటర్‌అయిన శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాలలో ఎవరు టైటిల్‌ సొంతం చేసుకుంటారో చూడాలి మరి. అయితే గ్రాండ్‌ ఫినాలేకు  బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దుమ్ము లేపేందుకు స్టార్‌ మా యాజమాన్యం ప్లాన్ చేస్తుంది.

Read Also : అక్షయ్ విరాళం : బాధిత కుటుంబాల్లో ఆనందం..

ఇందుకోసం ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని బిగ్‌బాస్‌ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఫైనల్‌ వార్‌ను మరింత రక్తి కట్టించడానికి చిరంజీవిని వేదిక మీదకు రప్పించాలన్నది వారి ఆలోచన. ఈ వార్త నిజమైతే చాలా రోజుల తర్వాత చిరుని బుల్లితెరపై చూడొచ్చు.