రాములమ్మ స్టెప్ వెయ్యండి: శ్రీముఖితో కలిసి డాన్స్ చెయ్యండి

  • Publish Date - October 28, 2019 / 12:35 PM IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారంలో శివజ్యోతి ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌ లో బాబా భాస్కర్‌, శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌, అలీ రెజా ఉన్నారు. అయితే వీళ్ల అభిమానులు తమకు నచ్చిన కంటెస్టెంట్‌ కి ఓట్లు వేయండని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ గొడవలు విపరీతంగా ఎక్కువవయ్యాయి.

అయితే శ్రీముఖీ ఫ్యాన్స్ మాత్రం ఏం చేసిన ఒక్కవారమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారంతో ముందుకొచ్చారు. శ్రీముఖిని గెలిపించడానికి సోషల్ మీడియాలో ‘రాములమ్మ కాంటెస్ట్‌’ అనే  ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. ఇందులో అమ్మాయిలు, అ‍బ్బాయిలు ఎవరైనా ప్రచారం చేయొచ్చు అని తెలిపారు. 

ఇంతకీ ఈ కాంటెస్ట్‌ ఏంటంటే… ఒసేయ్‌ రాములమ్మ పాటకు శ్రీముఖి చేసే సిగ్నేచర్‌ స్టెప్పును వేస్తూ వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ వీడియోను #THISTIMEWOMAN, #VOTEFORSREEMUKHI హ్యాష్‌ట్యాగ్‌ తో ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేయాల్సి ఉంటుంది. వాటిలో సూపర్ గా డాన్స్‌ చేసిన వారి వీడియోను ఎంపిక చేసి, వారికి శ్రీముఖితో కలిసి డాన్స్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. స్టెప్పుల కోసం శ్రీముఖి పిల్లలతో కలిసి చేసిన డాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఈ కాంటెస్ట్ ఎంతగా పనిచూస్తుందో చూడాలి.