Female Contestants is in Danger zone
Bigg Boss 7 6th Week : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఆరో వారం పూర్తి కావొస్తుంది. ఈ వారంలో అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, ప్రిన్స్ యావర్, పూజా మూర్తి, శోభా శెట్టి, నయని పావని లతో కలిపి మొత్తం ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్, ఐదో వారంలో శుభ శ్రీ ఇలా.. ఐదు వారాల్లో ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా వరుసగా ఐదుసార్లు అమ్మాయిలు ఎలిమినేట్ కావడం ఓ రికార్డు.
దీంతో ఆరో వారంలో ఖచ్చితంగా ఓ అబ్బాయే ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. ఈ సీజన్ ఊహాలకు అందని విధంగా ఉంటుందని ఆరంభం నుంచే బిగ్‌బాస్ బృందం చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కానుందనే టాక్ నడుస్తోంది. ఈ వారం ప్రిన్స్ యావర్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయట, ఆ తరువాత వరుసగా అమర్‌దీప్, టేస్టీ తేజలు ఉన్నారట. అశ్విని, పూజా మూర్తి లకు ఓటింగ్ శాతం మంచిగానే ఉందని, నయని పావని, శోభాశెట్టి లు ఆఖరి రెండు స్థానాల్లో నిలిచి డేంజర్ జోన్‌లో ఉన్నారట.
Sitara Ghattamaneni : తాతయ్య, తండ్రి పై సితార ఎమోషనల్ పోస్ట్.. ఇది నా DNAలోనే ఉంది..
ఓటింగ్ ఇదే పద్దతిన కొనసాగితే ఈ వారం ఖచ్చితంగా శోభాశెట్టినే ఎలిమినేట్ అవుతుందట. ఒకవేళ కొంచెం తారుమారు అయితే మాత్రం నయని పావని ఎలిమనేట్ కానుందని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ కూడా ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కానుందని టాక్. హౌస్ నుంచి బయటకు వెళ్లేది వైల్డ్ కార్డు కంటెస్టెంట్ పావని నా..? మొదటి నుంచి ఉన్న శోభాశెట్టి నా అన్నది తెలియాల్సి ఉంది. వీరిద్దరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయినా సరే.. రికార్డు స్థాయిలో వరుసగా ఆరు వారాల్లో ఆరుగురు అమ్మాయిలు హౌస్ నుంచి బయటకు వచ్చినట్లే అవుతోంది. చూడాలి మరీ బిగ్‌బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో.