Bigg Boss 7 Day 72 Highlights this week Nominations
Bigg Boss 7 Day 72 : సోమవారం నామినేషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. సోమవారం నాడు రతిక.. శోభాశెట్టి, ప్రియాంకలని నామినేట్ చేసింది. ఆ తర్వాత అర్జున్.. ప్రశాంత్, శోభాశెట్టిలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక.. రతిక, అశ్వినిలని నామినేట్ చేసింది. గౌతమ్.. అర్జున్, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. సోమవారం ఎపిసోడ్ లో కేవలం ఈ నాలుగు నామినేషన్స్ తోనే ముగించేశారు. ఈ నామినేషన్స్ లో రతిక గొడవలతో బాగా హైలెట్ అయింది.
ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తిచేశారు. మొదట ప్రశాంత్.. అర్జున్, రతికలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత అశ్విని.. ప్రియాంక, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. యావర్.. శోభాశెట్టి, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. శోభాశెట్టి.. యావర్, అశ్వినిలను నామినేట్ చేసింది. అమర్ దీప్.. గౌతమ్, యావర్ లను నామినేట్ చేశాడు. శివాజీ.. గౌతమ్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్స్ లో అమర్ దీప్ – యావర్ ఫైర్ అయి ఒకరి మీద ఒకరు అరుచుకొని కొట్టుకునేదాకా వెళ్లారు. వీళ్ళ గొడవని శివాజీ వచ్చి మధ్యలో ఆపాడు. ఆ తర్వాత అర్జున్ – యావర్ మధ్య కూడా గొడవ అయింది.
ఇక మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, రతిక, అశ్విని, యావర్, గౌతమ్ లు నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.