Bigg Boss 7 Day 89 : బిగ్బాస్ లో ఫినాలే రేస్ లోకి వెళ్లేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన గేమ్స్ లో గురువారం నాటికి అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ లు టాప్ లో నిలిచి నెక్స్ట్ పోటీలకు అర్హులయ్యారు. శుక్రవారం నాడు గౌతమ్ కి తక్కువ పాయింట్స్ ఉన్నాయని గౌతమ్ ని పోటీల నుంచి తప్పించ్చాడు బిగ్బాస్. వెళ్లేముందు అతనికి ఉన్న పాయింట్స్ ఎవరికో ఒకరికి ఇవ్వాలని చెప్పగా గౌతమ్ తన పాయింట్స్ ని అమర్ కి ఇచ్చి.. ఇవి ప్రియాంక దగ్గర తీసుకున్నవి, నువ్వు ప్రియాంకని ఏమనకూడదు అని చెప్పి ఇవ్వడం గమనార్హం.
గౌతమ్.. ప్రియాంకని ఏమనొద్దు అని పాయింట్స్ ఇవ్వడంతో హౌస్ లో కాసేపు దీనిపై చర్చ సాగింది. ఆ తర్వాత అర్జున్, అమర్, ప్రశాంత్ లకు కలర్ బాల్స్ అని గేమ్ పెట్టగా అందులో అర్జున్ విజయం సాధించాడు. అనంతరం అందరికి పనిషమెంట్ ఇస్తున్నాను అని చెప్పి గంట సేపు అందరూ నిద్రపోవాలని చెప్పాడు బిగ్బాస్. నిద్ర లేచిన తర్వాత కంటెస్టెంట్స్ ని గార్డెన్ ఏరియాకి పిలిచి టీ – స్నాక్స్ ఇచ్చి తమ ప్రేమ కథలు చెప్పమన్నాడు బిగ్బాస్.
Also Read : Bigg Boss 7 Day 88 : ఫినాలే రేసులో.. అదరగొడుతున్న అమర్ దీప్, పల్లవి ప్రశాంత్..
దీంతో కంటెస్టెంట్స్ అంతా తమ ప్రేమ కథలు, బ్రేకప్ కథలు చెప్పుకొచ్చారు. టికెట్ టు ఫినాలేలో ఫైనల్ కి వెళ్లే మొదటి కంటెస్టెంట్ కోసం చివరి గేమ్ పెట్టగా ఇందులో అమర్, ప్రశాంత్ లని ఎదుర్కొని అర్జున్ గెలిచాడు. దీంతో ఎవ్వరూ ఊహించని విధంగా అర్జున్ బిగ్బాస్ ఫైనల్ లోకి అడుగు పెట్టిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అసలు మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన అర్జున్, గొప్పగా ఆట కూడా ఆడకుండానే, ఎక్కువ పాపులారిటీ లేకుండానే బిగ్బాస్ ఫైనల్ టాప్ 5 లో చోటు సంపాదించాడంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఫైనల్ కి వెళ్లే మిగిలిన నలుగురు ఎవరో చూడాలి.