Bigg Boss 7 Day 92 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

ఈ నామినేషన్స్ అంతా చూస్తుంటే ఇన్నాళ్లు సాగిన సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ లాగే సాగాయి. బిగ్‌బాస్ చివరికి వస్తుండటంతో ఒక గ్రూప్ తో ఇంకో గ్రూప్ మరింత గొడవ పడుతుంది.

Bigg Boss 7 Day 92 Nominations in this week

Bigg Boss 7 Day 92 : బిగ్‌బాస్ 13 వారాలు పూర్తిచేసుకొని 14వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం నాడు గౌతమ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం అంటేనే నామినేషన్స్ హడావిడి. మళ్ళీ ఎప్పట్లాగే నిన్నటి సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ సాగాయి. ఒకరికొకరు అరుచుకుంటూ ఈ నామినేషన్స్ సాగాయి.

ఆల్రెడీ అర్జున్ ఫైనల్ కి చేరుకోవడంతో ఈ వారం అర్జున్ నామినేషన్స్ లో ఉండడు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక మిగిలిన వాళ్లలో యావర్.. శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు. శోభాశెట్టి.. యావర్, శివాజీలను నామినేట్ చేసింది. ప్రశాంత్.. అమర్, శోభాశెట్టిలను నామినేట్ చేశాడు. అర్జున్.. అమర్, యావర్ లను నామినేట్ చేశాడు. ప్రియాంక.. అమర్, యావర్ లను నామినేట్ చేసింది. శివాజీ.. ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు. అమర్.. ప్రశాంత్, యావర్ లను నామినేట్ చేశాడు.

ఈ నామినేషన్స్ అంతా చూస్తుంటే ఇన్నాళ్లు సాగిన సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ లాగే సాగాయి. బిగ్‌బాస్ చివరికి వస్తుండటంతో ఒక గ్రూప్ తో ఇంకో గ్రూప్ మరింత గొడవ పడుతుంది. నామినేషన్స్ లో అయితే ప్రశాంత్ – అమర్ ఒకరిపై ఒకరు ఫైర్ అయి కొట్టుకునేదాకా వెళ్లారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంకలు ఉన్నారు.

Also Read : Bigg Boss 7 Day 91 : ఈ వారం ఎలిమినేట్ ఎవరు? బిగ్‌బాస్ 7లో గెలిస్తే ఎంత డబ్బు వస్తుంది? ఇంకా ఏమేమి వస్తాయో తెలుసా?

ఇక ఇప్పటినుంచి జాగ్రత్తగా ఆడాలని చివరి రెండు వారాలు కూడా ఓటింగ్ ఉంటుందని, ప్రేక్షకులు అన్ని గమనిస్తున్నారని, ఎక్కువ ఓట్లు పడ్డవాళ్ళు విజేతలు అవుతారని, లేదంటే ఫైనల్ వారం ముందే ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ అందరికి వార్నింగ్ ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు