Bigg Boss 7 Day 95 : ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయ్యేది.. వెళ్లేముందు శివాజీ గురించి బయటపెడతా.. శోభాశెట్టి
ఈ వారం నేనే ఎలిమినేట్ అయ్యేది. కానీ వెళ్లేముందు శివాజీ గురించి గురించిన విషయాలన్ని బయటపెడతా అంటూ శోభాశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
- gum 95921
- Published On : December 8, 2023 / 07:09 AM IST
Bigg Boss 7 Day 95 highlights shobha shetty elimination discussion viral
Bigg Boss 7 Day 95 : బిగ్‌బాస్ సీజన్ 7 మరో పది రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం ప్రేక్షకులను ఓటు అడిగే అవకాశం ఇచ్చేందుకు కంటెస్టెంట్స్ కి పలు టాస్క్ లు ఇస్తూ వస్తున్నాడు బిగ్‌బాస్. మంగళవారం శోభాశెట్టి, బుధవారం అర్జున్ టాస్క్ లు గెలిచి ఆడియన్స్ ని ఓటు అడిగే అవకాశం అందుకున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ లో కూడా ‘ఓటు ఫర్ అపిల్’ అంటూనే మరికొన్ని టాస్క్ లు పెట్టారు. ఈ టాస్క్ ల్లో శోభాశెట్టి వెర్సస్ యావర్, ప్రశాంత్ వెర్సస్ అమర్ మధ్య గట్టి వాగ్వాదం జరిగింది.
ఇది ఇలా ఉంటే, ఈ ఎపిసోడ్ లో శోభాశెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శోభాశెట్టి, శివాజీ గురించి ప్రియాంకతో మాట్లాడుతూ.. “హౌస్ లోని వాళ్లంతా నేను చివరి రెండు స్థానంలో ఉన్నానని, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది నేనే అని అంటున్నారు. నేను ఎలిమినేట్ అయినా నాకు బాధ లేదు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం శివాజీ గురించిన విషయాలన్ని బయటపెట్టి వెళ్తాను. ఆ తరువాత ఆయన సంగతి ప్రజలే చూసుకుంటారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Abhiram Daggubati : లంకలో దగ్గుబాటి రాముడి కళ్యాణం.. పెళ్లి ఫోటో వైరల్
బిగ్‌బాస్ మానేజ్మెంట్ శివాజీకి సపోర్ట్ చేస్తుందని, అందుకనే ఆయన ఇన్నాళ్లు హౌస్ లో ఉన్నారని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు శోభా ఇలా మాట్లాడడంతో.. ఒకవేళ ఆమె ఎలిమినేట్ అయితే శివాజీ గురించి ఏం చెప్పబోతుందా అని ఆసక్తి మొదలయింది. కాగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శోభానే అని ఆడియన్స్ లో టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు శోభా కూడా తన ఎలిమినేషన్ గురించి మాట్లాడడంతో.. హౌస్ లో తన గేమ్ ఇక ముగియబోతుందని అర్ధమవుతుంది. కాగా ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంక, శివాజీ, అర్జున్ ఉన్నారు. వీరిలో అర్జున్ మొదటి ఫైనలిస్ట్ గా ఫినాలేకి ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో ఈ వీక్ నామినేషన్స్ లో అర్జున్ తప్ప అందరూ ఉన్నారు.
