Bigg Boss 7 Telugu : రైతు బిడ్డ తలకు గాయం.. కుప్పకూలిపోయిన పల్లవి ప్రశాంత్..!
బజర్ మోగగానే కంటెస్టెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎం బజర్ నొక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బతగలడంతో కుప్పకూలిపోయాడు.
- Thota Vamshi Kumar
- Published On : September 27, 2023 / 02:34 PM IST
Pallavi Prashanth injured
Bigg Boss 7 : బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షో లో విజయవంతంగా మూడు వారాలు ముగిశాయి. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని లు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజ లు ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. నామినేషన్లు ముగియడంతో ఇప్పుడు బిగ్‌బాస్ టాస్క్‌లు మొదలెట్టారు. నాలుగో పవర్ అస్త్ర గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకు అవకాశం ఇచ్చాడు.
ఇప్పటికే ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి లు పవర్ అస్త్రలు గెలవగా నాలుగో పవర్ అస్త్ర కోసం మిగిలిన వారు పోటీ పడుతున్నారు. వారి కోసం బిగ్‌బాస్ బ్యాంకు టాస్క్‌ను నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌస్ బ్యాంకుగా మారిందని చెప్పి బ్యాంకర్లుగా శివాజీ, సందీప్, శోభా శెట్టిలను నియమించాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో ఏటీఏంను ఏర్పాటు చేశారు.
ఏటీఎం నుంచి వచ్చే కాయిన్స్ ను మిగిలిన వారు సేకరించాల్సి ఉంటుంది. ఆట ముగిసే సరికి ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారికి పవర్ అస్త్ర దక్కుతుందని చెప్పాడు. బజర్ మోగిన వెంటనే కంటెస్టెంట్లు పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎంకు ఉన్న బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా బటన్‌ను నొక్కుతారో వారే వారు గెలిచినట్లు లెక్క.
పల్లవి ప్రశాంత్ తలకు గాయం
బజర్ మోగగానే కంటెస్టెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎం బజర్ నొక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బతగలడంతో కుప్పకూలిపోయాడు. మిగతా వారంతా అతడి చుట్టూ చేరి అతడికి ఏమైందోనని చూస్తున్నారు. శివాజీ మాత్రం ఏం కాలేదు.. ఏం కాలేదు అని అన్నాడు. మరీ ప్రశాంత్‌కు ఏ మేరకు గాయమైందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Vey Dharuvey : సాయి రామ్ శంకర్ గ్రాండ్ రీ ఎంట్రీ.. పండక్కి ముందే దరువేస్తానంటున్న పూరి తమ్ముడు..
