Vey Dharuvey : సాయి రామ్ శంకర్ గ్రాండ్ రీ ఎంట్రీ.. పండక్కి ముందే దరువేస్తానంటున్న పూరి తమ్ముడు..

సాయిరామ్ శంకర్ హీరోగా, కన్నడ భామ యష శివకుమార్ హీరోయిన్ గా నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో, దేవ్ రాజ్ పోతూరు నిర్మాణంలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘వెయ్ దరువేయ్’ అనే సినిమా రాబోతుంది.

Vey Dharuvey : సాయి రామ్ శంకర్ గ్రాండ్ రీ ఎంట్రీ.. పండక్కి ముందే దరువేస్తానంటున్న పూరి తమ్ముడు..

Sai Ram Shankar Re Entry with Vey Dharuvey Movie Releasing date announced

Updated On : September 27, 2023 / 1:13 PM IST

Vey Dharuvey : పూరి జగన్నాధ్(Puri Jagannadh) తమ్ముడిగా పరిచయమై పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్య పాత్రలు పోషించిన సాయి రామ్ శంకర్(Sai Raam Shankar) ఆ తర్వాత హీరోగా 143, బంపర్ ఆఫర్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. సాయిరామ్ శంకర్ చివరగా నేనోరకం సినిమాతో 2017లో ప్రేక్షకులని పలకరించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సాయి రామ్ శంకర్ ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

సాయిరామ్ శంకర్ హీరోగా, కన్నడ భామ యష శివకుమార్ హీరోయిన్ గా నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో, దేవ్ రాజ్ పోతూరు నిర్మాణంలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘వెయ్ దరువేయ్’ అనే సినిమా రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని నేడు ప్రకటించారు. దసరా పండగకు వారం రోజుల ముందే అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Also Read : VD13 Movie : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. VD13 ఫిక్స్.. టైటిల్ అనౌన్స్ త్వరలో..

ఇక ఇప్పటికే వెయ్ దరువేయ్ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్ రిలీజ్ చేశారు. వీటికి మంచి రీచ్ వచ్చింది. టీజర్ చూస్తుంటే ఇది ఫుల్ కమర్షియల్ సినిమాలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించగా ఆ పాట కూడా బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో సునీల్ విలన్ గా కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెయ్ దరువేయ్ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో సాయి రామ్ శంకర్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.