Bigg Boss 9 runner-up Thanuja remuneration details
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9కి ఎండ్ కార్డు పడింది. ఈ కొత్త సీజన్ కి విన్నర్ గా కామనర్, ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల నిలిచాడు. సీరియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. కానీ, విన్నర్ గా ఉండాల్సిన అన్ని అంశాలు తనూజలో ఉన్నాయి. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) విన్నర్ తనూజ అని చాలా మంది ఫిక్స్ అయ్యారు కూడా. అసలు చెప్పాలంటే, టైటిట్ ఫెవరెట్ గానే ఇంట్లోకి అడుగుపెట్టింది తనూజ. అనుకున్నట్టుగానే ఎక్కడ కూడా తగ్గకుండా తన ఆటతో ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. టాస్కులు, నామినేషన్స్, డిబేట్స్ ఇలా సిచువేషన్ ఏదైనా తన వాదన వినిపించింది.
Bigg Boss 9 Telugu: అప్పుడు కిసాన్.. ఇప్పుడు జవాన్.. చరిత్ర సృష్టించిన కామనర్స్..
దాంతో, చాలా మందికి ఫెవరెట్ గా మారింది తనూజ. కానీ, భరణితో బాండింగ్, అనవసరమైన చోట అతి వాదన లాంటివి తనూజకి నెగిటీవ్ గా మారాయి. అదే టైం లో కళ్యాణ్ పడాలకు పాజిటీవ్ అంశాలు సెట్ అయ్యాయి. అంతేకాదు, తనూజ, కళ్యాణ్ పడాల ఇద్దరు క్లోజ్ అవడం కూడా తనూజకి నెగిటీవ్ గా మారింది అనే చెప్పాలి. తన ఫ్యాన్స్ కూడా ఒకానొక సందర్భంలో కళ్యాణ్ కి సపోర్ట్ చేసిన సిచువేషన్ ఏర్పడింది. అలా, తనూజ వోటింగ్ దెబ్బతినింది అనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం తనూజ రెమ్యునరేషన్, ఎంత సంపాదించింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రన్నరప్ గా నిలిచినా విన్నర్ గా ఈక్వల్ గా తనూజ సంపాదించింది అని తెలుస్తోంది. ఈమెకు వారానికి రూ.2.8 వరకు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. అలా చూసుకుంటే 15 వారాలకు గాను రూ.42 లక్షలకు పైగా ఆమె సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే విన్నర్ ప్రైజ్ మనీతో సహా అతను గెలుచుకున్నది రూ.50 లక్షల వరకు గెలుచుకున్నాడు. అలాగే ఒక కారు కూడా. ఇలా చూస్తే ఓడిపోయినా తనూజ కూడా బాగానే సంపాదించింది అనే చెప్పాలి. మరి బిగ్ బాస్ తో వచ్చిన ఈ ఫేమ్ వీళ్ళ జీవితాలను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.