×
Ad

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్.. ఇది గమనించారా.. వరుసగా 9వ సీజన్‌లోనూ అదే జరిగింది.. మళ్లీ పురుషుడే..

విన్నర్ కల్యాణ్ 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు 5లక్షల చెక్, బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు సొంతం చేసుకున్నాడు.

Bigg Boss 9 Telugu: తెలుగులో ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో ముగిసింది. ఓ కామనర్ చరిత్ర సృష్టించాడు. సీజన్ 9 విన్నర్ గా కల్యాణ్ పడాల నిలిచాడు. సెలబ్రిటీని ఓడించి మరీ కామనర్ విజేత అయ్యాడు. నటి తనూజ రన్నరప్‌గా నిలిచింది. విన్నర్ కల్యాణ్ 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు 5లక్షల చెక్, బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు సొంతం చేసుకున్నాడు.

ఫైనల్ రేసులో ఐదుగురు నిలిచారు. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతడి ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి పోటీ నుంచి వైదొలిగాడు. పవన్ నిష్క్రమణతో విజేత ప్రైజ్‌మనీ 50 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయలకు తగ్గింది. చివరికి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్ టైటిల్ గెలుచుకున్నాడు. మొత్తం 105 రోజుల పాటు జరిగిన ఈ రియాల్టీ షో ఫినాలేతో ముగిసింది. కాగా, మరోసారి పురుషుడే విజేతగా నిలవడం గమనార్హం. ఇలా ఒకసారో రెండు సార్లో కాదు.. ఏకంగా 9 సీజన్లు పురుషులే బిగ్ బాస్ విజేతలుగా నిలవడం విశేషం.

సీజన్ల వారీగా విజేతలు వీరే..

సీజన్ 1: శివ బాలాజీ (సినీ నటుడు)
సీజన్ 2: కౌశల్ (నటుడు)
సీజన్ 3: రాహుల్ సిప్లిగంజ్ (సింగర్)
సీజన్ 4: అభిజిత్ (సినీ నటుడు)
సీజన్ 5: వీజే సన్నీ (నటుడు)
సీజన్ 6: రేవంత్ (సింగర్)
సీజన్ 7: పల్లవి ప్రశాంత్ (యూట్యూబర్)
సీజన్ 8: నిఖిల్ (సీరియల్ నటుడు)
సీజన్ 9 : కళ్యాణ్ పడాల (కామన్ మ్యాన్)

బిగ్ బాస్ 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ ను టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. 2వ సీజన్ ను 2018లో నాని హోస్ట్ చేశారు. తర్వాత 2019 నుండి ఇప్పటివరకు హోస్ట్ గా నాగార్జున విజయవంతంగా కొనసాగుతున్నారు.

Also Read: బిగ్‌బాస్ సీజన్ 9 విన్నర్ కల్యాణ్ పడాల ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాడో తెలుసా..