Rathika Rose : స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ రతిక.. స్వయంగా పోస్ట్ చేసి..

రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. హీరోయిన్ అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటుంది ఈ భామ.

Bigg Boss Fame Rathika Rose get a Heroine Chance in Raghavendra Rao Movie

Rathika Rose : రతిక రోజ్.. ఒకప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవ్వరికి తెలీదు. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వచ్చి అందర్నీ అలరించింది. తన అందాలతో, తన ఆటతో ప్రేక్షకులని మెప్పించి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంది. అయితే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండకుండా నాలుగు వారాలు అయ్యాక ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసింది. బిగ్ బాస్ తో రతిక రోజ్ ఫాలోయింగ్ కాస్తో కూస్తో పెరిగిందనే చెప్పొచ్చు.

రతిక గతంలో నారప్ప, దృశ్యం 2, నేను స్టూడెంట్ సర్.. లాంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. హీరోయిన్ అవ్వాలని ఎప్పట్నుంచో కలలు కంటుంది ఈ భామ. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక హీరోయిన్ ఛాన్స్ వచ్చింది రతికకు. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడం విశేషం. ఇటీవల ఓ ఇంగ్లీష్ పేపర్ కి రతిక ఇంటర్వ్యూ ఇవ్వగా.. తనకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. పేపర్ లో పబ్లిష్ అయిన ఈ వార్తని రతిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. నా డ్రీం నెరవేరబోతోంది అంటూ పోస్ట్ చేసింది.

lso Read : Aadya : టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కూతురు.. రేణు దేశాయ్‌తో పాటు..

అయితే రాఘవేంద్రరావు గారు ప్రస్తుతం సినిమాలు తీయట్లేదు. ఆయన శిష్యుల సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు. మరి రతిక చెప్పింది నిజమేనా లేక రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ వచ్చిందా అనేది తెలియాలి. మొత్తానికి బిగ్ బాస్ నుంచి బయటకి రాగానే హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అని సంబరపడిపోతుంది రతిక.