Prerana Kambam : తల్లి కాబోతున్న బిగ్ బాస్ భామ.. బేబీ బంప్ చూపిస్తూ..
సీరియల్ నటి, బిగ్ బాస్ భామ ప్రేరణ కంభం త్వరలో తల్లి కాబోతుంది. (Prerana Kambam)
- Saketh U
- Published on- September 16, 2026 / 11:45 AM IST
Prerana Kambam
Prerana Kambam : సీరియల్ నటి, బిగ్ బాస్ భామ ప్రేరణ కంభం త్వరలో తల్లి కాబోతుంది. తన బేబీ బంప్ ని చూపిస్తూ భర్తతో కలిసి ఓ చిన్న వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకుంది.
కన్నడ పరిశ్రమకు చెందిన ప్రేరణ మొదట్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం సీరియల్స్ చేస్తుంది. కన్నడలో పలు సీరియల్స్ చేసి తెలుగులో ‘కృష్ణ ముకుంద మురారీ’ అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ప్రేరణ పాల్గొని ఫైనల్ స్టేజి వరకు వెళ్ళింది. కప్పు గెలవకపోయినా పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం పలు టీవీ షోలలో కనిపిస్తుంది.
ప్రేరణ కర్ణాటకు చెందిన శ్రీపద్ దేశ్ పాండే అనే వ్యాపారవేత్తను 2023లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ప్రేరణ తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. దీంతో పలువురు సీరియల్ నటీనటులు, సెలబ్రిటీలు ప్రేరణ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
