Sohel : మోకాళ్ళ మీద కూర్చొని నా సినిమా చూడండి అంటూ ఏడ్చేసిన సోహెల్..

సోహెల్ బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరగగా బ్రహ్మానందం, సందీప్ కిషన్, సాయి రాజేష్.. పలువురు ముఖ్య అతిథులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss Fame Syed Ryan Sohel emotional in his Bootcut Balaraju Movie Pre Release Event

Syed Ryan Sohel : బిగ్ బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చిన మిస్టర్ ప్రగ్నెంట్ తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. త్వరలో సోహెల్ బూట్‌కట్ బాలరాజు(BootCut Balaraju) అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు సోహెల్. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో బిజీ ఉన్నాడు సోహెల్.

తాజాగా సోహెల్ బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరగగా బ్రహ్మానందం, సందీప్ కిషన్, సాయి రాజేష్.. పలువురు ముఖ్య అతిథులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

సోహెల్ మాట్లాడుతూ.. మా నాన్న రిటైర్మెంట్ పైసలు, నేను సంపాదించినా పైసలు ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్ని ఈ సినిమాకు పెట్టాను. సినిమాకు అందరూ కష్టపడతారు. సినిమా పరిశ్రమలో నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. కొంతమంది ఎంకరేజ్ చేయలేదు. హీరోగా పనిచేయను, నిలబడను అన్నారు. సినీ పరిశ్రమలో సపోర్ట్ ఉంటేనే నిలబడతాం. నేను సినిమాల్లోకి వస్తే పేరెంట్స్ కష్టాలు ఉన్నా మాకు సపోర్ట్ చేశారు. ఎంత కష్టపడ్డా ఇంకా ఫైట్ చేస్తా. డిప్రెషన్ లోకి వెళ్ళా. లైఫ్ క్లోజ్ చేసుకుందాం అని ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ ఇంట్లో పేరెంట్స్ కోసం బతకాలి మనం అంటూ తన సినిమా కష్టాలు, ఈ సినిమా కష్టాలు చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Chiranjeevi : అమ్మ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన పద్మవిభూషణ్ చిరంజీవి.. ఫొటోలు వైరల్

చివరగా స్టేజిపై మోకాళ్ళ మీద కూర్చొని అందరికి దండం పెడుతూ.. ఇంతకంటే ఏం చెప్పలేను. నా సినిమా థియేటర్ కి వచ్చి చూడండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీ చేయడానికి. నా కష్టాలు అన్ని చెప్పినా. ఇంతే.. నా సినిమా బూట్ కట్ బాలరాజు ఫిబ్రవరి 2 థియేటర్లోకి వచ్చి చూడండి అంటూ ఏడ్చేశాడు. దీంతో సోహెల్ స్పీచ్ వైరల్ గా మారింది.