Bigg Boss 5 Telugu : బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశంలోని ఏడు భాషల్లో ఈ షో ప్రసారం అవుతుంది. ఇక భాషతో సంబంధం లేకుండా ఈ రియాల్టీ షోకి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు దీని క్రేజ్ వేరనే చెప్పాలి. ఈ షో ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రేటింగ్ విషయంలో టాప్ ప్లేస్ లో ఉంటుంది బిగ్‌బాస్. తెలుగులో నాలుగు సీజన్లు జరగ్గా అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఐదో సీజన్ పై ప్రత్యేక దృష్టిపెట్టారు నిర్వాహకులు. వాస్తవానికి ఈ ఏడాది మే, లేదా జూన్ నెలల్లో బిగ్‌బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉండటంతో పోస్టుపోన్ చేశారు నిర్వాహకులు. ఇక ఐదవ సీజన్ ను సెప్టెంబర్ లో ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులు పూర్తయ్యేందుకు మరో నెలరోజులు పట్టె అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ ఐదో సీజన్ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇదిలా ఉంటే గత కొద్దీ రోజులుగా బిగ్‌బాస్ ఫైవ్ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్ట్ లో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక మంగ్లీ బిగ్‌బాస్ సెట్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదట.. బోనాల సందర్బంగా ఆమె పాడినపాట వివాదాలకు తావివ్వడంతో బిగ్‌బాస్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట.. అయితే నిర్వాహకులు మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించి, షోకి తీసుకురావాలని షో భావిస్తున్నారు.