Bigg Boss 8 : నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎప్పుడూ ఇద్దరు.. ఇప్పుడు ఒక్కరే..

Bigg Boss gave an unexpected shock to the housemates regarding the nominations

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఊహించని ట్విస్టులతో కొనసాగుతుంది. ఇక ఈ వరం హౌస్ నుండి అందరూ అనుకున్నట్టుగానే నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ప్రతీ వారం ఎలిమినేషన్స్ తర్వాత యధావిధిగా నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అందులో భాగంగానే నేడు నామినేషన్స్ కి సంబందించిన ప్రోమో విడుదల చేసారు.

Also Read : Shah Rukh Khan : 95 రోజులు షారుఖ్ ఇంటిదగ్గరే.. ఎట్టకేలకు అభిమాని ఎదురుచూపులు ఫలించాయి..

ఇక ప్రోమో చూసుకుంటే.. మొదట్లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. ఎప్పుడూ చేసే విధంగా ఇద్దరిని కాకుండా ఒక్కరిని మాత్రమే నామినేట్ చెయ్యాలని చెప్తే.. మొదట పృథ్వి వచ్చి రోహిణి.. బస్తా టాస్క్ లో నెక్ ఫాంటసీ వాడారు అని చెప్పడం నచ్చలేదు అని నామినేట్ చేసారు. తర్వాత హరితేజ వచ్చి.. మీరు ప్రతిసారి నన్ను ఫేక్ ఫేక్ అంటున్నారు. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటది అని ప్రేరణ పై మండిపడింది. అప్పుడు ప్రేరణ అమ్మ అక్కా.. నేను ఆలా అనలేదు అని వెటకారం చేస్తూ ఇద్దరూ వాదనకి దిగారు.

తర్వాత నిఖిల్ యష్మి గురించి గౌతమ్ ను నామినేట్ చేస్తూ..ఎవరన్నా వద్దు అంటే ఆపెయ్యాలి అని అంటే.. గౌతమ్ నేను అక్క అంటే తను తమ్ముడు అనింది.. అది తను అనకుండా ఉండాల్సింది అంటే.. నిఖిల్ మాట్లాడుతూ..నిన్ను అశ్వద్ధామ అంటే నీకు ఎలా కోపం వస్తుందో ఎదుటివాళ్ళకు అలానే వస్తుందని అన్నారు. అనంతరం నామినేట్ అయిన సభ్యులపై బిగ్ బాస్ నల్ల రంగులో ఉన్న నీళ్లు పోశారు. అలా ప్రోమో ముగిసింది. మరి ఈ వరం ఎవరెవరు నామినేషన్స్ లో ఉంటారు, ఎవరు ఇంట్లో నుండి బయటికి వస్తారన్నది చూడాలి.