×
Ad

Bigg Boss Kannada : బిగ్‌బాస్ ఫ్రీగా చూసేయొచ్చు.. ఎందులోనో తెలుసా?

మన తెలుగు బిగ్‌బాస్ స్టార్ మా ఛానల్ లో రోజు రాత్రి పూట చూడొచ్చు. అలాగే హాట్‌స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులో చూడొచ్చు.

  • Published On : September 17, 2023 / 08:55 AM IST

Bigg Boss Kannada Season 10 Free Streaming in Jio Cinemas OTT

Bigg Boss Kannada : బిగ్‌బాస్ రియాల్టీ షో దేశంలోని అన్ని పలు భాషల్లో ప్రతి సంవత్సరం సీజన్లు సీజన్లు సాగుతూనే ఉంది. ఇటీవలే తెలుగులో కూడా నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైంది. ఇప్పటికే మొదటి వారం పూర్తయి రెండో వారం పూర్తవ్వొస్తుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 పూర్తయింది. ఇప్పుడు కన్నడలో బిగ్‌బాస్ మొదలవ్వబోతుంది.

కన్నడలో ఇప్పటికే బిగ్‌బాస్ షో 9 సీజన్లు పూర్తి చేసుకొని త్వరలో పదవ సీజన్ మొదలవ్వనుంది. గత తొమ్మిది సీజన్లుగా హోస్ట్ చేసిన కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఈసారి కూడా బిగ్‌బాస్ హోస్ట్ చేస్తున్నారు. త్వరలో బిగ్‌బాస్ 100 రోజుల పండగ మొదలవ్వబోతుంది అంటూ ఇటీవలే కన్నడ బిగ్‌బాస్ ప్రోమో రిలీజయింది.

మన తెలుగు బిగ్‌బాస్ స్టార్ మా ఛానల్ లో రోజు రాత్రి పూట చూడొచ్చు. అలాగే హాట్‌స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులో చూడొచ్చు. అయితే కన్నడ బిగ్‌బాస్ కలర్స్ కన్నడ ఛానల్ లో చూడొచ్చు. అలాగే జియో సినిమా ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే కన్నడ బిగ్‌బాస్ సీజన్ 10 జియో సినిమాలో ఫ్రీగా చూసేయొచ్చు.

Also Read : Bigg Boss 7 Day 13 : ఈ వారం డేంజర్ లో ఉన్నది ఎవరు? ఇద్దరు కంటెస్టెంట్స్ సేఫ్..

ఇటీవల జియో సినిమా ఐపీఎల్ ని ఫ్రీగా టెలికాస్ట్ చేసి మిగిలిన ఓటీటీలకు గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పుడు కన్నడ బిగ్‌బాస్ రైట్స్ తీసుకొని అది కూడా ఫ్రీగా టెలీకాస్ట్ చేస్తూ మరింత సంచలనం సృష్టిస్తుంది. దీంతో ఈ బిగ్‌బాస్ సాగినన్ని రోజులు కన్నడలో జియో సినిమా కి మంచి డిమాండ్ ఉండటం గ్యారెంటీ.